ఊబకాయం వచ్చిందంటే దానితో పాటు ఒక ఐదారు రకాల రోగాలను కూడా వెంట పట్టుకొస్తుంది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ తో వంటి దీర్ఘకాలిక ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలో చెరిపోతాయి. తాజాగా ఊబకాయంలో కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం హెచ్చరిస్తుంది. జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం పెద్ద పేగు క్యాన్సర్ అధిక బరువు కలిగి ఉన్న వారిలో ఎక్కువగా వస్తుందని వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బరువు తగ్గడం కూడా కొలోరెక్టల్ క్యాన్సర్ కి కారణమనే విషయం రోగనిర్ధారణ సమయంలో బయట పడింది.


ఊబకాయం వల్ల కొలోరెక్టల్, కిడ్నీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ మధ్య సంబంధం స్పష్టంగా కనిపించిందని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. స్థూలకాయం ఉన్న వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం సాధారణ బరువు ఉన్నవారి కంటే మూడింట ఒక వంతు ఎక్కువని మునుపటి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దాదాపు 12 వేల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. రోగనిర్ధారణ సమయంలో వారి శరీర బరువు ఎలా ఉందనే సమాచారం అందించారు. అలాగే రోగనిర్ధారణకు ముందు సంవత్సరాలలో వారి బరువు ఏ విధంగా ఉందనేది తెలుసుకున్నారు. 10 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు ఉన్న బరువుని పరిగణలోకి తీసుకున్నారు.


రోగనిర్ధారణ సమయంలో శరీర బరువు ఆధారంగా కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదానికి మధ్య సంబంధాన్ని సూచించడం సాధ్యం కాదు. అయితే పరిశోధకులు అధ్యయనంలో పాల్గొన్న వారి మునుపటి శరీర బరువు మధ్య తేడా చాలా భిన్నంగా ఉంది. రోగనిర్ధారణకి 8 నునకి 10 సంవత్సరాల మందు బరువు ఎక్కువగా ఉన్నారు. పెద్ద పేగు క్యాన్సర్ చాలా ప్రమాదకరం. తగిన సమయంలో రోగనిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు


⦿ మలంలో రక్తం పడటం


⦿ పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి


⦿ బరువు కోల్పోవడం


⦿ పొట్ట ఉబ్బరంగా అనిపించడం


⦿ విపరీతమైన అలసట


ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అవుతుందని అనుకోవడానికి వీల్లేదు. రెండు లేదా మూడు వారాల పాటు ఇవే లక్షణాలు కొనసాగితే మాత్రం తప్పనిసరిగా వైద్యులను కలిసి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు. వయసు పైబడే కొద్ది ఈ క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెస్, రెడ్ మీట్ అతిగా తినడం వల్ల కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాధి దశను బట్టి క్యాన్సర్ కి చికిత్స చేస్తారు. చివరి దశలో క్యాన్సర్ ని గుర్తిస్తే మాత్రం ప్రాణాలు నిలబడటం కష్టమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మహిళలూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మ్యాజికల్ ఫుడ్ టిప్స్ పాటించాల్సిందే