గోర్లు కొరకడం చాలా మందికి ఉన్న చెడు అలవాటు. ఇదే కాదు కొంతమంది ఎప్పుడు చూసినా ముక్కులో వేళ్ళు పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి చెత్త అలవాట్ల వల్ల డిమెన్షియా(Dementia) వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ హెల్త్ ప్రకారం 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలలో దాదాపు 5-8 శాతం మంది చిత్త వైకల్యంతో బాధపడుతున్నారు. ఇది 65 ఏళ్లు దాటిన ప్రతి ఐదు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. 80 ఏళ్ల వయసులో ఉన్న వారిలో సగం మందికి అల్జీమర్స్, పార్కిన్సన్స్ డీసీజ్ బారిన పడుతున్నారు. మగవారి కంటే ఆడవారిలో అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిత్తవైకల్యం కేసులు అధికంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.


చిత్త వైకల్యం కలిగించే అనారోగ్య అలవాట్లు


ముక్కు కదిలించడం


గ్రిఫిట్ యూనివర్సిటీ నిర్వహించిన ఇక అధ్యయనం ప్రకారం ముక్కు మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం వల్ల చిత్త వైకల్యం, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం క్లామిడియా న్యుమోనియా నాసికా కుహరం, మెదడు మధ్య ఉన్న నాడిని కదిలించడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. మెదడులోని కణాలు అమిలాయిడ్ బీటా ప్రోటీన్ ను విడుదల చేస్తాయి. ఇవి అల్జీమర్స్ రావడానికి కారణం అవుతాయి. ముక్కులో ఎక్కువగా వేళ్ళు పెట్టి తిప్పడం, కదిలించడం, ఒత్తిడి తీసుకురావడం వల్ల ముక్కు లైనింగ్ దెబ్బతింటుంది. దీని వల్ల మెదడులోకి బ్యాక్టీరియా చేరిపోతుంది.


ఒంటరిగా ఉండటం


బాధగా అనిపించినప్పుడు చాలా మంది ఒంటరిగా గడిపేందుకు మొగ్గు చూపుతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్నిహిత వ్యక్తులు లేదా మిత్రులతో సంతోషంగా ఉంటే మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. అలా కాకుండా ఒంటరిగా ఉంటే మెదడు క్షీణతను తీవ్రతరం చేస్తుంది. జయం హాప్కిన్స్ అధ్యయనం ప్రకారం డిమెన్షియా ముఖ్యంగా వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.


ఎక్కువ జంక్ ఫుడ్ తినడం


జంక్ ఫుడ్ తినడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇవి ఎక్కువగా తినే వ్యక్తుల్లోని మెదడు ఆరోగ్యంతో ముడిపది ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే వాపు, ఆక్సీకరణ ఒత్తిడి, వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.


నిద్రలేమి


హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో చిత్తవైకల్యం వచ్చే అవకాశం రెండింతలు, చనిపోయే అవకాశం రెండు రేట్లు ఎక్కువగా ఉంది.


హెడ్ ఫోన్స్ లో ఎక్కువ వాల్యూమ్


మీరు రోజుకి 30 నిమిషాలు అంత కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్ ఉపయోగించి ఫుల్ వాల్యూమ్ లో సంగీతం వింటున్నరా? అలా చేస్తే డిమెన్షియా  లేదా మెదడు పనితీరు క్షీణతకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. మీ హెడ్ ఫోన్స్ గరిష్ట వాల్యూమ్ లో 60 శాతానికి మించకుండా వాల్యూమ్ తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేస్తున్నారా? జాగ్రత్త డిప్రెషన్ లోకి వెళ్ళే ప్రమాదం ఉంది