Stock Market Closing 27 April 2023:  


స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. రియాల్టీ, ఐటీ, బ్యాంకు, ఆటో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 101 పాయింట్లు పెరిగి 17,915 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 348 పాయింట్లు పెరిగి 60,649 వద్ద ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.



BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,300 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,315 వద్ద మొదలైంది. 60,271 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,698 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 348 పాయింట్ల లాభంతో 60,649 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 17,818 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,813 వద్ద ఓపెనైంది. 17,797 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,931 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 101 పాయింట్లు పెరిగి 17,915 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,753 వద్ద మొదలైంది. 42,736 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,043 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 170 పాయింట్లు పెరిగి 43,000 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పవర్‌ గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మెటల్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 81.78 వద్ద ఉంది.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు యథాతథంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.61,040గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.76,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.28,870 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.