Stock Market Opening 27 April 2023:  


స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. రియాల్టీ, ఐటీ, బ్యాంకు, ఆటో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 28 పాయింట్లు పెరిగి 17,842 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 84 పాయింట్లు పెరిగి 60,385 వద్ద కొనసాగుతున్నాయి. బజాజ్‌ ట్విన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,300 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,315 వద్ద మొదలైంది. 60,271 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,436 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 84 పాయింట్ల లాభంతో 60,385 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 17,818 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,813 వద్ద ఓపెనైంది. 17,797 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,850 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 28 పాయింట్లు పెరిగి 17,842 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,753 వద్ద మొదలైంది. 42,736 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,940 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 15 పాయింట్లు పెరిగి 42,845 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, యూపీఎల్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పవర్‌ గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, అపోలో హాస్పిటల్స్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌లు తగ్గాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.61,040గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.76,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.28,870 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.