Nita Ambani Necklace As A Special Attraction In Her Son's Pre-Wedding Ceremony: భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్ అట్టహాసంగా జరిగింది. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. ప్రపంచ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలోని చాలా అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పార్టీకి వచ్చిన అతిథులకు ఏకంగా 2500 రకాల వంటకాలు చేయడం దగ్గర నుంచి, వాళ్లకు కల్పించిన వసతుల వరకు అన్నీ వెరీ వెరీ స్పెషల్ గా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేడుకలగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిలవడం విశేషం.  


స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ పచ్చలహారం


ఇక ఈ సంబురాల్లో అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ధరించిన వస్ట్రాలు, ఆభరణాలు మరింత అట్రాక్షన్ గా నిలిచాయి. అద్భుతమైన కాంచీపురం చీర కట్టుకుని అందంగా ముస్తాబయ్యింది. ఆ చీరకు అద్దినట్లుగా ఉండే పచ్చలహారం మరింత శోభను తీసుకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే పచ్చలు పొదిగిన ఈ నెక్లెస్ అతిథులను ఎంతో బాగా ఆకట్టుకుంది. ఈ నెక్లెస్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో చివరి రోజు (మార్చి 3న) నీతా అంబానీ ఈ నెక్లెస్ ను ధరించింది.


రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆమె ధరించిన కాంచీపురం చీరను రూపొందించారు. ఆయన సూచనలు, సలహాల మేరకు పచ్చలహారాన్ని తయారు చేశారు. ఈ నెక్లెస్ లో రెండు పెద్ద పెండెంట్ లతో అనుసంధానించబడిన చిన్న చిన్న ఎమరాల్డ్ ఉంటాయి. దీనికి మ్యాచింగ్ చెవి బుట్టాలు, గాజులు,  రింగ్ ఉంటుంది. నీతా నెక్లెస్ లోని ఎమరాల్డ్ లు, వజ్రాలు చాలా ఖరీదైనవి. ఎంతో అరుదైనవి కూడా. ఈ పచ్చల హారం ఖరీదు సుమారు రూ.500 కోట్లు ఉంటుందట.






కోట్ల విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించడం కొత్తేమీ కాదు!


అంబానీ ఇంట్లో జరిగే వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాల విలువ కోట్లల్లోనే ఉంటుంది. ముఖేష్ కూతురు ఇషా అంబానీ తన పెళ్లిలో ఏకంగా రూ. 90 కోట్లు విలువ చేసే లెహంగా ధరించి అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ప్రీ వెడ్డింగ్ బాష్ లో అనంత్ అంబానీ రూ. 14 కోట్ల విలువ చేసే వాచ్ ధరించి హాట్ టాపిక్ గా నిలిచారు.


Read Also: అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ బాద్‌షాకు అవమానం? షారుఖ్‌ను పక్కకు పొమ్మన్నారా? వీడియో వైరల్