Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrations: భారతీయ దిగ్గజ వ్యాపారావేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులతో పాటు గ్లోబల్ టెక్ సీఈఓలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో పాప్ స్టార్స్ పర్ఫార్మెన్స్ లు అలరించాయి. బాలీవుడ్, టాలీవుడ్ సహా పలువురు సినీ పరిశ్రమలకు చెందిన నటులు డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముఖేష్ అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట. ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో జరుగుతున్నన చివరి పెళ్లి కావడంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ బాష్ కు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రపంచలో జరిగిన అత్యంత ఖరీదైన వేడుకగా గుర్తింపు పొందింది.
షారుఖ్ ఖాన్ కు అవమానం?
తాజాగా ఈ వేడుకకు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే? బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ కలిసి డ్యాన్స్ చేశారు. అక్కడే ముఖేష్ అంబానీ పెద్దకొడుకు ఆకాష్ అంబానీ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో తన తల్లి నీతా అంబానీని డ్యాన్స్ చేయాలని ఆకాష్ పిలిచాడు. ఆ సమయంలో షారుఖ్‌ను కాస్త పక్కకు వెళ్లాలనని ఆకాష్ చెప్పాడు. వెంటనే షారుఖ్ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అనే కనీస గౌరవం లేకుండా షారుఖ్ ఖాన్ పట్ల ఆకాష్ వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ‘‘డబ్బు ఉండవచ్చు. కానీ, సంస్కారం కూడా ఉండాలి కదా?’’ అంటూ విరుచుకుపడుతున్నారు.
ఆకాష్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంకోలా స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కోసం పక్కనే అతిథి మర్యాదలు చేశారని, వాటిని తీసుకోవాలని ఆకాష్ సూచించినట్లు కామెంట్ పెడుతున్నారు. షారుఖ్ పక్కకు వెళ్లి గ్లాస్ లో ఏదో డ్రింక్ తాగడం కనిపిస్తుంది. షారుఖ్ ను ఆకాష్ అవమానించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు ఏంటనేది షారుఖ్ చెప్తే తప్ప బయటకు తెలిసే అవకాశం లేదు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఆ వీడియో ఇప్పటిది కాదని.. 2019లో ఆకాష్ అంబానీ పెళ్లినాటి వీడియో అని తెలిసింది. అయితే, కొందరు కావాలనే అనంత్ అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రచారం చేస్తున్నారు.
Read Also: ‘UI’ ట్రోల్ సాంగ్: సోషల్ మీడియా జనాలపై ఉపేంద్ర సెటైర్లు - కుమారి ఆంటినీ వదల్లేదుగా!