National Daughters Day 2024 : జాతీయ వ్యాప్తంగా కుమార్తెను గౌరవిస్తూ.. వారిపై ప్రేమను వ్యక్తం చేసేందుకు ఓ రోజు ఉంది. అదే డాటర్స్ డే. మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా నేషనల్ డాటర్స్ డే కూడా ఉంది. ఆడపిల్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంతకీ ఈ డాటర్స్డేని ఎప్పుడు నిర్వహిస్తారు? దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ప్రాముఖ్యత.. వారికి ఎలాంటి విషెష్ చెప్పొచ్చు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
సమాజంలో బాలికల పట్ల ఉన్న ప్రతికూలతలను దూరం చేస్తూ.. నేషనల్ డాటర్స్ డేని నిర్వహిస్తున్నారు. సామాజికంగా వారికున్న నిబంధనలను దూరం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ప్రతి అమ్మాయికి తన జీవితంలో ప్రేమ, గౌరవం, గుర్తింపు దక్కేలా చూడడమే డాటర్స్ డే లక్ష్యం. ప్రతి అమ్మాయిని సమాజం గౌరవించాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్వాహణ సదస్సులు కూడా చేస్తారు.
పితృస్వామ్య సమాజంలో కొడుకులతో పోలిస్తే.. కూతుళ్లకు గౌరవం కాస్త తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇండియాలో అమ్మాయిలను చులకనగా చూసేవాళ్లు, వారి అభిమానానికి, ప్రేమకి, ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ కూడా ఇవ్వనివారు చాలామందే ఉన్నారు. పైగా కుటుంబ పరవు అంటూ తెచ్చే సామాజిక ఒత్తిడి మగవారిపై కంటే ఆడవారిపైనే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లింగ సమానత్వం గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఏటా సెప్టెంబర్ నాలుగో ఆదివారం రోజు నేషనల్ డాటర్స్ డేని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మాయలకు ఈ విషెష్ పంపి.. వారికి మోరల్ సపోర్ట్ ఇచ్చేయండి.
Also Read : అమ్మాయిలు వాటిని అశ్రద్ధ చేస్తే ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు.. ఎందుకంటే
- నా జీవితంలో నువ్వు నాకు దక్కిన అందమైన, విలువైన బహుమతి. నీ పుట్టుక నా జీవితాన్నే మార్చేసింది రా చిట్టి. హ్యాపీ డాటర్స్ డే.
నువ్వే నా సన్ షైన్, నువ్వే నా ఆనందం, నువ్వే నా సర్వస్వం.. అంటూ మీ అమ్మాయికి డాటర్స్ డే విష్ చెప్పేయండి. - నిన్ను కన్నా తర్వాత నేను మరో కొత్తలోకం చూశాను బంగారు తల్లీ. నువ్వు కూతురివే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా కడుపున పుట్టినా.. నీ నుంచే నేను చాలా విషయాలు నేర్చుకున్నానంటూ విష్ చేయొచ్చు.
- నువ్వు మా ప్రతిబింబమే కాదు. మీ ప్రపంచాన్ని నీ రాకతో వెలుగులు నింపావు అంటూ విషెష్ చెప్పొచ్చు.
- నీలోని కృషి, పట్టుదల నిన్ను ఈ స్థానానికి చేర్చింది. నువ్వు మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, అవకాశాలు అందుకోవాలని.. నీ ప్రతి అడుగు వెనుక నేను నీకు తోడుగా ఉంటాను బంగారు తల్లీ.
- నువ్వు ఎంత ఎదిగినా నాకు చిట్టితల్లివే. ఇంకోవిషయం చెప్పడం మరచిపోయాను.. ఈ ప్రపంచంలో నేనే నీకు అందరికన్నా పెద్ద ఫ్యాన్. హ్యపీ డాటర్స్ డే.
- నువ్వు నా జీవితంలో లక్కీ ఛార్మ్రా. నిన్ను చూస్తే నా బాధలన్నీ మరచిపోతాను.
- నువ్వు కూతురివి కాదమ్మ.. నా మరో అమ్మవి. చిన్నప్పుడే అమ్మని దూరం చేసుకున్న నాకు అమ్మరూపంలో వచ్చిన బంగారు తల్లివి. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీకు నేను ఎప్పుడూ ఆనందాన్నే ఇస్తాను.
ఇలా మీ అమ్మాయికి డాటర్స్ డే విషెష్ చెప్పేయండి. ముఖ్యంగా తండ్రికి, కూతురుకి ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి బాండింగ్ చాలా ప్రేమతో నిండి ఉంటుంది. అలాగే తల్లీ, కూతుళ్లు ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ కొన్ని కారణాలు, సామాజిక ఒత్తుళ్లు వల్ల కూతుళ్లపై వారు కొన్నిసార్లు రూడ్‌గా బిహేవ్ చేస్తారు. అలాంటి ధోరణిని ఉండకూడదనే అంశాన్ని సూచిస్తూ.. ఈ డాటర్స్ డేని నిర్వహిస్తున్నారు. అమ్మాయిలు కేవలం పెళ్లి కోసమే కాదని.. వారిని కెరీర్లో ముందుకు నడిపించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆ బాటను తల్లిదండ్రులే చిన్ననాటి నుంచి వేయాలని ఆశిస్తూ.. హ్యాపీ డాటర్స్ డే.
Also Read : అమ్మాయిలు బయటకు వెళ్లేప్పుడు ఈ వస్తువులు తప్పక తీసుకెళ్లండి.. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉండాలి..