National Cancer Awareness Day 2023 : ప్రతి సంవత్సరం భారతదేశంలో 1.1 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ మరణాల రేటులో కూడా మన దేశం ఇప్పటికీ అగ్రగామిగానే ఉందని WHO నివేదిక ఇచ్చింది. మన దేశంలో క్యాన్సర్‌పై ఎంతవరకు అవగాహన ఉందో ఈ నివేదికే చెప్తుంది. క్యాన్సర్‌ను తగ్గించుకోగలిగే ఆప్షన్లు ఉన్నా సరే.. సరైన అవగాహన లేక చాలామంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజలకు దీనిపై అవేర్నెస్ కల్పించడం చాలా ముఖ్యం.
క్యాన్సర్‌లో రకాలు, దానిని ముందుగా ఎలా గుర్తించాలి.. జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేస్తే.. క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.. ఎలాంటి చికిత్సలు తీసుకుంటే దీనిని జయించవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా నవంబర్ 7వ తేదీన నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు, ఎన్జీవోలు క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తారు. ఇవి రోగ నిర్ధారణ, తీసుకోవాల్సిన చికిత్సలపై ఫోకస్ పెట్టేందుకు సహాయం చేస్తుంది.
ఈరోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే..
నోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జయంతిని పురస్కరించుకుని.. ఈ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆమె నివాళిగానే కాకుండా.. క్యాన్సర్‌తో బాధపడే, పోరాడే వారికి తమ సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆంకాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో, క్యాన్సర్ బాధితుల జీవితాలను మెరుగుపరచడంలో ఇది సాయం చేస్తుంది.
సోషల్ మీడియా మంచి ప్లాట్ఫారం
ఒకప్పటితో పోలీస్తే.. వీటిపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ఓ మంచి ప్రత్యామ్నయంగా చెప్పవచ్చు. చాలామందిలో క్యాన్సర్ గుర్తించినా.. వైద్యానికయ్యే ఖర్చును భరించలేమని మధ్యలోనే చికిత్స తీసుకోవడం ఆపేస్తారు. మరికొందరు క్యాన్సర్ లక్షణాలు గుర్తించక.. ఆలస్యం చేస్తారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం.. మందులు వాడడం.. ట్రీట్మెంట్ తీసుకోవడం వంటి విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే డే గా.. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని నిర్వహిస్తున్నారు. ఇది క్యాన్సర్ బారిన పడకుండా.. హెల్తీ లైఫ్ చేయడానికి అవసరమయ్యే ఓ రిమైండర్‌గా చెప్పవచ్చు.
ఏయే అంశాల గురించి చర్చించాలంటే..
ఈ స్పెషల్ డే రోజు.. క్యాన్సర్‌లోని రకాలు.. వాటికి గల కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మెరుగైన చికిత్సలు.. వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. మీ వైద్యులు మీకు క్యాన్సర్ ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తే.. మీరు కొన్ని ముఖ్యమైన పరీక్షలు వైద్యుని సూచనల మేరకు చేయండి. వారు ఇచ్చే మందులను రెగ్యూలర్‌గా తీసుకోండి. మానసికంగా మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. క్యాన్సర్ నుంచి అంత త్వరగా బయటపడొచ్చు. క్యాన్సర్ నుంచి బయటపడిన వారు తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే.. అది ఇంకా బెటర్‌గా ప్రజల్లోకి వెళ్తుంది. క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు, రెగ్యూలర్ చెక్ అప్ ప్రాముఖ్యతలు తెలియజేయాలి.
క్యాన్సర్‌పై పరిశోధనలు, చికిత్సలకు ప్రజలు మద్ధతునిచ్చేలా అవగాహన పెంచాలి. ఎందుకంటే.. వివిధ వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు చికిత్సల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
Also Read : చలికాలంలో ఈ సింపుల్ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు