Horoscope Today 07th november 2023 (దిన ఫలాలు నవంబర్ 07, 2023)


మేష రాశి


 రాశి వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మంచిరోజు. స్నేహితుల నుంచి సహాయం తీసుకోవడానికి వెనుకావద్దు. ఉద్యోగం, వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. ఎదుటివారి గురించి మంచిగా ఆలోచించండి. ప్రేమ సంబంధాలలో మునిగిపోతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.


వృషభ రాశి


ఈ రాశివారు ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యతనివ్వలేరు. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల విధేయత కలిగి ఉండాలి. వైవాహిక జీవితంలో  సంతోషం పెరుగుతుంది. 


మిథున రాశి


రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి ఇది మంచి సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్ధులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు పొందవచ్చు. మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయడానికి ఇది మంచి రోజు.


Also Read: దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!


కర్కాటక రాశి


నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ముఖ్యమైన పనులను ఆలస్యం చేయవద్దు. పెద్ద భాగస్వామ్యంలో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అదుపులేని కోపం వల్ల ఇబ్బందిపడతారు. ఉద్యోగులకు ఇదే మంచి సమయం.


సింహ రాశి


ఈ రాశి ఉద్యోగులకు సీనియర్ల నుంచి మంచి సహాయం అందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బావుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఏ బంధాన్ని దుర్వినియోగం చేయవద్దు. మాట్లాడే సమయంలో నియంత్రణలో ఉండాలి. మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. 


కన్యా రాశి


మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ప్రేమ సంబంధం వివాహంగా మారుతుంది. విదేశాల్లో చదువుకునేవారికి ఈ రోజు మంచిది. మనసులో ఆలోచనల ప్రవాహం పెరుగుతుంది. మీరు దూర ప్రయాణాలకు సిద్ధంగా ఉండాలి. ఈ స్వభావం కారణంగా అందరికీ మీపై కోప్పడుతుంది.


Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!


తులా రాశి


మీ పనికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. పనికి సంబంధించిన లక్ష్యాలను సులభంగా సాధిస్తారు.వైవాహిక బంధం బావుంటుంది.   మీరు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు.  తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు.


వృశ్చిక రాశి


ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. ఆరోగ్యం బావుంటుంది. ప్రతిభ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక సంబంధిత విషయాలకు సంబంధించి మీ నిర్ణయాలను మార్చుకుంటారు. కార్యాలయంలో మీపై పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. డబ్బు సంబంధిత విషయాలకు సంబంధించి మీరు మీ నిర్ణయాలను మార్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.


ధనుస్సు రాశి


ఈ రాశివారికి ఇతరుల సలహాలు కలసొస్తాయి. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఐటీ ఉద్యోగులకు ఈరోజు మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. 


Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!


మకర రాశి


సహోద్యోగి కారణంగా మీ పనిలో ఆటంకాలు ఏర్పడొచ్చు. ఇంట్లో ఆందోళనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీరు కార్యాలయంలో కొన్ని మార్పులు చేయవచ్చు. మీ మనస్సులో అలజడిని శాంతింపజేయడానికి ప్రయత్నించండి.


కుంభ రాశి


ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనిలో ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులతో మీ సమన్వయం బావుంటుంది. కుటుంబం, వ్యాపారం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


మీన రాశి


ఈ రాశి వ్యాపారులు వ్యాపారం విస్తరించేందుకు రుణం తీసుకుంటారు. ప్రారంభించిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. సహోద్యోగులతో మంచి సంభాషణను కొనసాగించాలి. మీకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా మీరే తీసుకోండి..ఎవ్వరి మాటలకు ప్రభావితం కావొద్దు. శుభకార్యం కోసం షాపింగ్ చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. న్యాయపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు.