శివాజీకి ‘బిగ్ బాస్’ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అతడి కొడుకును ఇంట్లోకి పంపించి.. ఆయన కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మంగళవారం రాత్రి ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ మొదలై సుమారు 10 వారాలు కావడంతో హౌస్‌లోకి వారి కుటుంబ సభ్యులను, లేదా ఫ్రెండ్స్‌ను పంపనున్నాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా బిగ్ బాస్.. ముందుగా శివాజీ ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపినట్లు తెలుస్తోంది.
డాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ కొడుకు
గార్డెన్ ఏరియాలో కూర్చొని కబుర్లు చెబుతున్న శివాజీని మెడికల్ రూమ్‌లోకి రావాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో శివాజీ తన చేతి ట్రీట్మెంట్ కోసం అనుకుని లోపలి వెళ్లాడు. అక్కడ డాక్టర్ అతడికి పరీక్షలు చేసి.. ఇక వెళ్లొచ్చని చెప్పాడు. దీంతో తిరిగి వెళ్లిపోతున్న శివాజీని.. సార్ అని పిలిచాడు డాక్టర్. ఆ తర్వాత తన ముఖానికి ఉన్న మాస్క్, క్యాప్ తొలగించి.. శివాజీని పలకరించాడు. అది మరెవ్వరో కాదు.. శివాజీ కొడుకు. తన కొడుకును చూడగానే శివాజీ ఆనందానికి అవధుల్లేవు. వెంటనే అతడిని హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకుని హౌస్‌లోకి తీసుకెళ్లి.. అందరికీ పరిచయం చేశాడు. తప్పకుండా ఈ ఎపిసోడ్ ఎమోషనల్‌గా ప్రేక్షకుల గుండెలను బరువెక్కిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
యావర్ అలక..
తన కోసం కాకుండా అర్జున్ కోసం శివాజీ బీన్ బ్యాగ్ టాస్క్ ఆడాడనే కారణంతో యావర్ అలిగాడు. అప్పటి నుంచి శివాజీతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు. ఈ విషయంపై శివాజీ.. అర్జున్‌తో మాట్లాడుతూ ‘‘యావర్ అంత హర్ట్ ఎందుకయ్యాడో అర్థం కావడం లేదు’’ అని అన్నాడు. ‘‘ఆడలేనని తెలిసినప్పుడు.. అక్కడికి వెళ్లి ఆడటం ఎందుకు అని’’ అర్జున్ సమాధానం ఇచ్చాడు. ‘‘నేను ఆడాను కాబట్టే కదా.. ఆయన ఉన్నది. వాడి కోసం నేను హౌస్‌తో ఫైట్ చేశాను’’ అని తెలిపాడు శివాజీ.
కొడుకుతో ఛాలెంజ్ చేసి.. బిగ్ బాస్‌లోకి..
శివాజీ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన కొడుకు గురించి చెబుతూ వస్తున్నాడు. తన కొడుకు తనతో ఛాలెంజ్ చేశాడని, అందుకే బిగ్ బాస్‌కు వచ్చానని తెలిపాడు. చేతికి గాయమైనా తిరిగి వెళ్లకుండా.. మైండ్ గేమ్‌తో నెట్టుకుని వస్తున్నాడు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, యావర్‌లకు సపోర్ట్ చేస్తూ.. ప్రత్యేకంగా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు శివాజీ. ప్రస్తుతం ఆ గ్రూప్‌కు, సీరియల్ గ్రూప్‌కు మధ్య వార్ నడుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్వినీ.. మొదట్లో శివాజీ చెంతకు చేరినా, ఇప్పుడు పార్టీ మార్చేసింది. ఆమె ఇప్పుడు కేవలం భోలే అభిమాని. ఇక గౌతమ్.. ఏ గ్రూపులో చేరకుండా ఇండివిడ్యువల్‌గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అర్జున్ అక్కడో కాలు, ఇక్కడో కాలు వేస్తూ ఆచీ తూచి ముందుకు వెళ్తున్నాడు. సీరియల్ బ్యాచ్‌కు బయట బ్యాడ్ నేమ్ ఉందని భావించి.. అమర్, శోభా, ప్రియాంకలకు దూరంగా ఉంటున్నాడు. గౌతమ్‌తో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ఇక భోలే, రతికాలు కూడా శివాజీ గ్రూపులోనే చేరారు. ప్రస్తుతమైతే శివాజీదే పైచేయి. విజేత కూడా అతడే అని బయట టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఉల్టా పుల్టా కదా. విజేతకు బదులు రన్నర్‌కు కప్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
Also Read: శోభా, ప్రియాంక కాళ్లకు మొక్కిన అశ్వినీ - తప్పుచేస్తే పీకేయండి అంటూ శివాజీ ఫైర్