‘బిగ్ బాస్’ సీజన్ 7( Bigg Boss Telugu 7 )లో సోమవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈ వారం నామినేషన్స్ బాధ్యతలను లేడీ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టారు. ప్రియాంక జైన్, రతిక రోజ్, శోభా శెట్టి, అశ్వినీ శ్రీలు రాజమాతలుగా సింహాసనాలపై కూర్చొని.. మిగతా హౌస్‌మేట్ల వాదోపవాదాలు విన్నారు. ముందుగా అమర్‌దీప్.. భోలేను నామినేట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్, పల్లవి ప్రశాంత్‌లు నామినేట్ చేశారు. ఆ తర్వాత యావర్.. అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. అయితే, రాజమాతలు భోలే, గౌతమ్‌లను నామినేట్ చేశారు. చెప్పాలంటే ఈ నామినేషన్స్ చాలా సిల్లీగా సాగాయి.
శివాజీని నామినేట్ చేసిన గౌతమ్..
డాక్టర్ అంటూ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఒక డాక్టర్ అయ్యుండి నీ క్యారెక్టర్ ఏమవుతుందని అన్నారు. ఇందుకు శివాజీ స్పందిస్తూ.. డాక్టర్ అనడం తప్పా అని వాదించాడు. నువ్వు కెమేరా దగ్గరకు వెళ్లి శివాజీ నన్ను తొక్కేస్తున్నాడు అని చెప్పావు అన్నాడు. గౌతమ్ స్పందిస్తూ.. ‘‘నేను తొక్కేస్తున్నాడని నేను చెప్పలేదు’’ అని అన్నాడు. గౌతమ్‌తో ఏకీభవించిన రాజమాతలు శివాజీని నామినేట్ చేస్తున్నప్పుడు ప్రకటించారు. దీంతో శివాజీ ‘‘ప్రేక్షకులను నేను కోరుకొనేది ఏంటంటే.. నేను తప్పుడు నా బిడ్డనైతే తీసిపడేయండి. నా గేమ్ బాగోలేకపోతే ఎలిమినేట్ చేసేయండి. నేను కోరుకొనేది కూడా అదే. ఆ అస్త్రం మీ చేతిలో ఉంది’’ అని అరిచాడు.
యావర్ సెల్ఫ్ నామినేషన్
నామినేషన్స్‌లో శివాజీ.. అమర్ దీప్‌ను నామినేట్ చేశాడు. బ్యాగ్ లాగడం తన చెయ్యి నొప్పి వచ్చిందనే రీజన్‌తో శివాజీ నామినేట్ చేశాడు. అయితే, ఇద్దరూ ఒకరినే నామినేట్ చేయకూడదనే రూల్ వల్ల అమర్ దీప్ నామినేషన్‌లో బతికిపోయాడు. అయితే, యావర్ కూడా అమర్ దీప్‌నే నామినేట్ చేయాలనుకున్నాడు. శివాజీ అప్పటికే ఆ పేరు చెప్పాడు. దీంతో బిగ్ బాస్ మరొకరిని ఎంపిక చేసుకోవాలని యావర్‌ను కోరాడు. యావర్ తనకు తానే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. దీంతో రాజమాతల్లో శోభా, ప్రియాంక.. యావర్ ఎలిమినేట్ అయ్యాడని, రతిక, అశ్వినీలు.. అమర్ దీప్‌ను నామినేట్ చేద్దాం అనుకున్నామని కానీ.. శోభా, ప్రియాంకలు చెప్పినట్లు యావర్‌ను నామినేట్ చేస్తామన్నారు. యావర్ నామినేట్ అయ్యాడు. చివరిగా నలుగురిలో ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ పేర్కొన్నాడు. దీంతో రతిక, అశ్వినీ.. ప్రియాంక పేరు చెప్పారు. శోభాశెట్టి, ప్రియాంక రతిక పేరు చెప్పారు. రతిక, ప్రియాంక పేర్లు టై కావడంతో.. కెప్టెన్‌గా శోభా నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శోభా.. రతిక పేరు చెప్పింది. చెప్పాలంటే.. ఈ వారం నామినేషన్స్ పర్వం చాలా త్వరగా ముగిసింది. అయితే, ఆసక్తికరంగా లేదు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత చెత్త నామినేషన్స్ ప్రక్రియ ఇదేనని ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే: భోలే షావలి, గౌతమ్, శివాజీ, యావర్, రతిక. దీంతో రతిక మరోసారి డేంజర్ జోన్‌లోకి వచ్చింది. అశ్వినీ బతికిపోయింది. రతిక ఈ వారం కూడా రిలాక్స్‌గా ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేవారం సూట్ కేసు సర్దేసుకోవల్సిందే. మొన్నటి వరకు స్ట్రాంగ్‌గా ఉన్న యావర్ కూడా ఈ సారి వీక్ అయ్యాడు. శివాజీపై అలకతో ఆయన అభిమానుల ఓట్లను కోల్పోయే అవకాశాలున్నాయి. అయితే, ఈ వారం యావర్.. శివాజీతో ఎలా ఉంటాడనే దానిపైనే అది ఆధారపడి. రతికాకు ఈ సారి శివాజీ అండదండలు ఉంటే మాత్రం టఫ్ ఫైట్ నడిచే అవకాశాలున్నాయి.
Also Read: శోభా, ప్రియాంక కాళ్లకు మొక్కిన అశ్వినీ - తప్పుచేస్తే పీకేయండి అంటూ శివాజీ ఫైర్