‘బిగ్ బాస్’ హౌస్ కుళాయి దగ్గర మహిళలు పెట్టుకొనే పంచాయతీలా మారిపోయింది. సోమవారం నామినేషన్లలో భాగంగా.. హౌస్‌లోని నలుగురు మహిళలను మహరాణులను చేశాడు బిగ్ బాస్. మిగతా హౌస్‌మేట్స్ చెప్పే నామినేషన్స్ కారణాలు.. న్యాయంగా ఉన్నట్లయితే రాణి వెళ్లి కత్తితో ఆ కంటెస్టెంట్ ఫొటోను పొడవాలి. చిత్రం ఏమిటంటే.. మేల్ హౌస్‌మేట్స్ నామినేషన్స్ గురించి వాదించుకుంటుంటే.. వారి కోసం మహరాణులు పోట్లాడుకున్నారు. అమర్ దీప్, భోలేల నామినేషన్ల సమయంలో ప్రియాంక, అశ్వినీల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కెప్టెన్ శోభాశెట్టి కూడా వారి మధ్యలోకి దూరింది. ప్రియాంక, శోభాశెట్టి కలిసి.. అశ్వినీపై విరుచుకుపడ్డారు. దీంతో అశ్వినీ శోభా, ప్రియాంకల కాళ్లకు మొక్కింది. 


నలుగురి మధ్య వాగ్వాదం


హౌస్‌లో ఉన్న నలుగురు లేడీ కంటెస్టెంట్స్ రతిక రోజ్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అశ్వినీ శ్రీలకు నామినేషన్స్ చేసుకొనే అవకాశం వచ్చింది. అప్పటికే వేడి మీద ఉన్న ఆ నలుగురూ మనసులో ఉన్నవన్నీ కక్కేసుకున్నారు. నామినేషన్స్‌లో భాగంగా ప్రియాంక జైన్.. రతిక పేరు చెప్పింది. ‘‘ఈ వీక్ చూడు అన్నావు కదా’’ అని అందింది. రతిక సమాధానం ఇస్తూ.. ‘‘నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి.. నేను చేశా’’ అని తెలిపింది. ఆ తర్వాత శోభ.. రతికాను నామినేట్ చేస్తూ.. ‘‘ఇక్కడ ఉన్నవారితో కంపేర్ చేస్తే నువ్వు చాలా వీకెస్ట్ కంటెస్టెంట్’’ అని తెలిపింది. రతిక స్పందిస్తూ.. ‘‘నన్ను వీక్ అన్నావు కదా.. నువ్వు వీక్’’ అని అంది. ‘‘నేను వీక్ అయితే ఇదే హౌస్‌లో సర్వైవ్ అయ్యేదాన్ని కాదు. హౌస్‌లో ఫస్ట్ లేడీ హౌస్ మేట్ అయ్యాను’’ అని శోభా తెలిపింది. దీంతో రతిక స్పందిస్తూ.. ‘‘నువ్వు నాకు ఆఫ్ట్రాల్.. నాకు నీతో జతే వద్దు’’ అని అంది. దీంతో శోభా.. ‘‘ఏంటీ నేను నీకు ఆఫ్ట్రాలా?’’ అని అంది. 


ఆ తర్వాత అశ్వినీ.. ప్రియాంకను నామినేట్ చేస్తూ ‘‘రివర్స్ చేసి మాట్లాడకు ప్రియాంక అని అంది. ‘‘నువ్వు ఎలాగైనా మాట్లాడవచ్చు’’ అని ప్రియాం అరిచింది. ‘‘నువ్వు అరిస్తే నేనూ అరుస్తా. అరవడం నాకూ వచ్చు అని’’ అంటూ అశ్వినీ మరింత రెట్టించింది. దీంతో ప్రియాంక.. ‘‘అరువు..’’ అని తెలిపింది. ఇలా ఇరువురి అరుపుల మధ్య నామినేషన్స్ సాగాయి. అయితే, వారి అరుపుల గురించి అక్షరాల్లో చెప్పడం కష్టమే. కాబట్టి.. ఈ ప్రోమోలో చూసేయండి. 



అందరి టార్గెట్ గౌతమ్


ఈ వారం గౌతమ్‌కు గట్టిగానే నామినేషన్స్ పడినట్లు తెలుస్తోంది. గత వారం కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాలు. గేమ్‌లో నాగార్జున ఎత్తిచూపిన కొన్ని లోపాలను తీసుకుని అంతా గౌతమ్‌ను నామినేట్ చేసినట్లు సమాచారం. గౌతమ్ తర్వాత భోలే, శివాజీ, రతికా, ప్రియాంక, అశ్వినీ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్‌గా ఉన్న శోభా శెట్టికి ఈ వారం ఇమ్యునిటీ లభించింది. దీంతో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యింది. 


Also Read: శోభా, ప్రియాంక కాళ్లకు మొక్కిన అశ్వినీ - తప్పుచేస్తే పీకేయండి అంటూ శివాజీ ఫైర్