Naegleria Fowleri Symptoms and Treatment : స్మిమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు లేదా బాలిక మృతి అని చూస్తూ ఉంటాము. కానీ స్విమ్మింగ్ పూల్‌లోని నీటితో మెదడు తినే అమీబా సోకి బాలిక మృతి అనేవి రేర్ కేసులు. అసలు కొందరికి ఇలాంటి ఓ ఇన్ఫెక్షన్ ఉంటుందని కూడా తెలియదు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలిక.. నేగ్లేరియా ఫౌలెరీ(Naegleria Fowleri) అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో చనిపోయింది. దీనినే మెదడు తినే అమీబా అంటారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది? దీనికి ఏమైనా చికిత్స ఉందా? ఎన్నిరోజులు బతుకుతారు? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మంచినీటి నదిలో స్నానం చేసేప్పుడు
కేరళలోని ఓ బాలిక.. తన ఇంటికి సమీపంలోని బంధువలు ఇంటికి వెళ్లింది. అక్కడ నదిలో బంధువులతో కలిసి స్నానం చేసింది. ఆ సమయంలోనే బాలికకు ప్రాణాంతకమైన అమీబా సోకినట్లు తెలుస్తోంది. స్నానం తర్వాత బాలికకు తలనొప్పి, వాంతులు కావడంతో.. బంధువులు పేరెంట్స్‌కి సమాచారం చేరవేశారు. వారు పాపను వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. బాలిక మాత్రమే కాకుండా మరో నలుగురు చిన్నారులు కూడా ఆస్పత్రిలో చేరారు. వారు తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు కానీ.. బాలిక పరిస్థితి మాత్రం విషమించింది. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారంపాటు వెంటిలేటర్‌పై ఉండి పాప ప్రాణాలు విడిచింది.
కేరళలో ఇదేమి కొత్త కేసు కాదు..
ఈ తరహా ఘటన కేరళలో కొత్తేమి కాదు. గత ఏడాది జూలైలో ఓ 15 ఏళ్ల బాలుడు.. తన ఇంటి సమీపంలోని కాలువలో ఈత కొట్టాడు. అతనికి మెదడు తినే అమీబా సోకి వారంలోనే మరణించాడు. అయితే నేగ్లేరియా ఫౌలెరి మంచినీటి సరస్సులు, చెరువులు, అన్లోరినేటెడ్ కొలనులు, అరుదైన సందర్భాల్లో పంపు నీటిలో కూడా కనిపిస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్గా అభివృద్ధి చెంది.. ప్రాణాంతకమవుతుంది. కాబట్టి దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలా వ్యాపిస్తుందంటే(Naegleria Fowleri Causes)..
మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ నీటి ద్వారా ముక్కు లోపలికి చేరి.. మెదడుకు వెళ్తుంది. తద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. నోటితో మింగడం ద్వారా ఈ వ్యాధి సోకదు. నీటిలో ఆడటం, ఈతకొట్టడం వంటి సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ ముక్కులోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మనం వినియోగించే నీటిలో కూడా ఉండొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు.
లక్షణాలు ఇవే.. (Naegleria Fowleri Symptoms)
మెదడును తినే అమీబా(నెగ్లేరియా ఫౌలెరి) ఇన్ఫెక్షన్ సోకితే.. దాని లక్షణాలు ఒకటి నుంచి వారంలో రోజుల్లోపే అభివృద్ధి చెందుతాయి. తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, మెడ నొప్పి, వాంతులు ప్రారంభంలో ఉంటాయి. అనంతరం ఈ లక్షణాలు రోగిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల మూర్ఛ, మతిమరుపు, కోమా, చివరికి ప్రాణాంతకమవుతుంది. CDC ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ సోకిన చాలామంది వ్యక్తలు 18 రోజులలోపే మరణిస్తున్నారని తెలిపింది.
నివారణ చర్యలు(Naegleria Fowleri Treatment)
ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో మరణాల రేటు 85 కంటే ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రాణాంతకమైందో. కాబట్టి నీటి వనరులలో ఈతకు దూరంగా ఉండాలి. పూల్స్, స్ప్లాష్ ప్యాడ్లు, వాటర్పార్క్లలో జాగ్రత్తగా ఉండాలి. అన్లోరినేటెడ్ వాటర్ వినియోగం మానుకోవాలి. ముక్కును క్లీన్ చేసుకోవడానికి.. పంపు నీటిని ఉపయోగించకూడదు. ఈత కొట్టే సమయంలో లేదా నీటిలోపల ఉండే సమయంలో ముక్కును మూసుకోవాలి. లేదా క్లిప్స్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకదు.
Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్‌తో హాయిగా నిద్రపోండి