Monsoon Illness in Children: వర్షాకాలంలో వానలతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. తేమ పెరగడం, పరిసరాల్లో నీరు నిలిచిపోయి దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ లాంటి సమస్యలకు కారణం అవుతాయి. ముఖ్యంగా వానాకాలంలో చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నారులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తేమ కారణంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలు వృద్ధి చెంది అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, శ్వాస సంబంధ సమస్యలకు కారణం అవుతాయి. ఈ సీజన్ లో తల్లిందండ్రులు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంతకీ అవేంటో చూద్దాం..


వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులు


1. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్


సాధారణంగా జలుబు అనేది తేమ వాతావరణంలో వృద్ధి చెందే వైరస్ వల్ల వస్తుంది. వైరల్ ఫీవర్ కారణంగా, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పారాసెటమాల్ సిరప్ వాడటం మంచిది. వేడి ద్రవాలను తాగించడం వల్ల జలుబు నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. అలెర్జీలు, ఆస్తమాకు గురయ్యే పిల్లల్లో దగ్గు, ఊపిరి ఆడకపోవటం, గురక లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  


2. గ్యాస్ట్రోఎంటెరిటిస్


గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది ఆహారం, నీరు కలుషితం కావడం వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు ఏర్పడుతాయి. వాంతులు తగ్గడానికి ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ చేయాలి. చిన్నారులు నీరసంగా కనిపించినా, ఆహారం తీసుకోకపోయినా, వాంతులు, విరోచనాలు కలిగినా వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి. 


3. టైఫాయిడ్


కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం వల్లే టైఫాయిడ్ వస్తుంది. జ్వరం, అనారోగ్యం, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం మంచిది. 


4. కామెర్లు


కామెర్లు కూడా కలుషిత మంచి నీరు కారణంగానే వస్తుంది. మూత్రం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. వెంటనే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.


5. డెంగ్యూ


దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, దద్దుర్లు ఏర్పడుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అత్యవసర వైద్యం అవసరం.  


6. మలేరియా


మలేరియా కూడా దోమల ద్వారానే వ్యాపిస్తుంది. తీవ్రమైన చలి జ్వరం వస్తుంది. వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.


7. చర్మ సమస్యలు


వర్షాకాలంలో చంకలు, గజ్జలు, కాలి వేళ్ల మధ్యలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడుతాయి.  


వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులు నివారణ


1. హెల్దీ ఫుడ్ తినిపించాలి


వర్షాకాలంలో పిల్లలకు పోషకాహారాన్ని పెట్టాలి.  తాజాగా పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినిపించాలి. విటమిన్లు A, E, C, B-కాంప్లెక్స్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ లాంటి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందివ్వాలి. 


2. పచ్చి పుడ్స్ తీసుకోవద్దు


వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా సలాడ్‌లు సహా పచ్చి ఆహార పదార్థాలను తినిపించకూడదు. 


3. హైడ్రేషన్


వర్షాకాలంలో బాడీ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. సరిపడ నీళ్లు తాగించాలి. వేడి వెజిటబుల్ సూప్, హెర్బల్ టీ, కాచి వడపోసిన నీళ్లు ఇవ్వాలి. 


4. పరిసరాల్లో నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి


వర్షకాలంలో ఇంటి పరిసరాల్లో నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే దోమలు పెరిగి పలు రకాల వ్యాధులకు కారణం అవుతాయి.


5. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు


వర్షాకాలంలో దోమలు కుట్టకుండా దోమ తెరలు, దోమ బ్యాట్లు సహా దోమల నివారణ లిక్విడ్స్ ఉపయోగించాలి. 


6. టీకాలు


వర్షాకాలంలో పిల్లలకు టైఫాయిడ్, ఇయర్లీ  ఫ్లూ వ్యాక్సీన్ ఇప్పించాలి.





Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!