MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

ఆఫ్రికాను మరో వైరస్ వణికిస్తోంది. అదే మంకీ పాక్స్ వైరస్.

Continues below advertisement

కరోనా వైరస్ దెబ్బకే కుదేలైంది ఆఫ్రికా. ఇప్పుడ మరో వైరస్ మెల్లగా ప్రజల్లో పాకడం మొదలైంది. అదే మంకీ పాక్స్ వైరస్. ఈ మంకీపాక్స్ వైరస్ కేసులు మొదలో ఆఫ్రికా దేశాల్లో కనిపించాయి. అక్కడ్నించి ఇతర దేశాలకు పాకడం కూడా మొదలైపోయింది. అమెరికా, ఇంగ్లాండులలో అక్కడక్కడ ఈ వైరస్ సోకిన రోగులు ఆసుపత్రికి రావడం అక్కడ కలవరంగా మారింది. నైజీరియా నుంచి ఇంగ్లాండు వెళ్లిన వ్యక్తికి మంకీ పాక్స్ వైరస్ సోకిందని, అతని ద్వారానే ఇంగ్లాండులో ఇద్దరికీ ఈ వైరస్ లక్షణాలు కనిపించినట్టు నిర్ధారించారు. ఈ వైరస్ చాలా అరుదైనది. అంత సులువుగా ఇది ఇతరులకు వ్యాపించదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. తుమ్ము, దగ్గులు, గాలి ద్వారా ఇది వ్యాపించదని చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా చాలా దగ్గరగా ఉంటేనే ఇదే సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సమయంలో ఈ వైరస్ నోరు, ముక్కు, కళ్లు, శ్వాసనాళం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే గాయాలు తగిలినప్పుడు చర్మం ఓపెన్ అయి ఉంటుంది. వైరస్ ఆ గాయం ద్వారా శరీరంలో చేరే అవకాశం ఉంది. 

Continues below advertisement

లక్షణాలు ఎలా ఉంటాయి?
మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 

1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట

అమ్మవారిలాగే...
చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది. 

ఎందుకొస్తుంది?
మాంసాహారం తినేవారిలో అధికంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల లేదా ఈ వైరస్‌ను మోస్తున్న జంతువులను ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి చేయడం వల్ల కూడా మంకీపాక్స్ వైరస్ శరీరంలో చేరుతుంది. ఈ వైరస్ సోకాక రెండు నుంచి నాలుగు వారాల్లో పోతుంది. ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనది కాదని ఆరోగ్యినిపుణులు నిర్ధారించారు. 

ఈ వైరస్‌ను 1958లో తొలిసారి గుర్తించారు. కోతులలో ఈ వైరస్ మొదటిసారి బయటపడడంతో దీనికి మంకీ పాక్స్ అని పేరు వచ్చింది.  

Also read: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Also read: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Continues below advertisement
Sponsored Links by Taboola