ఆకుకూరల్లో పుదీనా కూడా భాగమే. అయితే దీన్ని పెద్దగా వినియోగించరు. బిర్యానీల్లో వాసన కోసం వేసుకోవడమో లేక అప్పుడప్పుడు పుదీనా చట్నీ చేసుకోవడమో తప్ప పుదీనాను పెద్దగా వినియోగించరు. నిజానికి దీన్ని రోజూ తినాల్సిన అవసరం ఉంది. పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్ ప్లమ్మేటరీ గుణాలు అధికం. వీటిని తినడం వల్ల శరీరంలో వాపు, నొప్పి వంటివి త్వరగా తగ్గుతాయి. పుదీనాలో విటమిన్ సి, డి,ఇ, బి, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను తప్పకుండా తినాలి. పుదీనాలో నిద్రలేమిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది ముందుంటుంది. పుదీనాను రోజూ తింటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. దీనిలో మెంథాల్ ఉంటుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరాన్ని, మనసును రీఫ్రెష్ చేసే గుణం పుదీనాకు అధికం. దీని ఆకుల్లో సాలిసిలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరే హానికర ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపిస్తుంది. దీనివల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ప్రకాశవంతంగా మారుతుంది. పుదీనా ఆకులు పచ్చివి నమిలినా కూడా చాలా మంచిది. దంతాల్లోని బ్యాక్టిరియాల మరణిస్తుంది. ఇది మౌత్ వాష్‌గా పనిచేస్తుంది. 


కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు - ఒక కప్పు
మినపప్పు - పావు కప్పు
శెనగపప్పు - అరకప్పు
ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
చింతపండు - కొంచెం
ఉప్పు - రుచికి సరిపడా
ఎండు మిర్చి - పది 


తయారీ ఇలా
1. పుదీనా ఆకులను ముందు కాస్త వేయించుకోవాలి. నల్లగా మారకుండా చూసుకోవాలి. 
2. మినపప్పు, శెనగపప్పు కూడా వేయించాలి. చివరిలో ఎండు కొబ్బరి తురుము కూడా వేయించాలి. 
3. తరువాత ఎండుమిరప కాయలు కూడా వేయించి పెట్టుకోవాలి. 
4. మినపప్పు, శెనగపప్పు, ఎండు మిర్చి, కొబ్బరి తురుము ముందుగా మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేయాలి. 
5. ఇప్పుడ ఉప్పు, పుదీనా ఆకులు, చింతపండు వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. 
6. మీకు కావాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు. చాలా స్పైసీగా కావాలనుకుంటే మరిన్ని ఎండు మిర్చి వేసుకోవచ్చు. 


Also read: భోజనం చేశాక తమలపాకు ఎందుకు నమలాలి?


Also read: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు


Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే, కొత్త అధ్యయన ఫలితం