Mental Health Alert : మెంటల్ హెల్త్ అనేది ఈ రోజుల్లో అందని ద్రాక్ష అయిపోతుంది. మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి.. మానసికంగా కృంగిపోతున్నారు. ఇలా మీరు మెంటల్‌గా డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు మీ శరీరంలో, రోజువారి చేసే పనుల్లో కొన్ని మార్పులు చూస్తారు. అవేంటో తెలుసుకొని.. మీ కండీషన్‌ని అర్థం చేసుకొని.. వాటినుంచి బయటపడేందుకు ఏమి ఫాలో అవ్వాలో రొటీన్‌ని సెట్ చేసుకోవాలి.
మానసికంగా మీరు హెల్తీగా లేకుంటే అది మిమ్మల్ని అనేక మార్గాల్లో కృంగదీస్తుంది. ఆరోగ్యం నుంచి.. మీరు చేసే పనుల్లో.. మీ ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పడతారు. అందుకే వీలైనంత తొందరగా మీ బాడీ ఇచ్చే సంకేతాలను గుర్తించి.. వాటిని ఓవర్ కామ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ మెంటల్ హెల్త్ పాడైందని చెప్పడానికి తెలిపే సంకేతాలు ఏంటి? వాటిని అధిగమించేందుకు ఏమి ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం.
మానసిక ఆరోగ్యానికి ఇవే రెడ్ ఫ్లాగ్స్
నిద్ర : మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మీరు బాగా ఎక్కువగా పడుకుంటారు. ఎప్పుడు నిద్ర కావాలనే ఫీల్‌లో ఉంటారు. లేదంటే అస్సలు నిద్ర ఉండదు. ఎంత ట్రై చేసినా.. ఎన్ని టిప్స్ ఫాలో అయినా మీకు సరైన నిద్ర ఉండదు.
అలసట : మీరు ఏ పని చేసినా ఏ పని చేయకున్నా అలసిపోతూ ఉంటారు. ఓపిక, శక్తి ఉండదు. ఖాళీగా కూర్చొని ఉన్నా కూడా మీకు అలసిపోయినా ఫీలింగ్ వస్తుంది.
ఫుడ్ : మానసికంగా ఆరోగ్యం బాలేనప్పుడు మీరు తినే అలవాట్లలో మార్పులు ఉంటాయి. ఒకటి అస్సలు తినకపోవడం లేదంటే ఎక్కువ తినడం. ఫుడ్ క్రేవింగ్స్ పెరిగిపోయి స్ట్రెస్‌లో ఎక్కువగా తింటారు. లేదా అస్సలు ఫుడ్ తినకుండా ఉంటారు.
తలనొప్పి : తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరంలోని అన్ని భాగాలు నొప్పి కలిగిన ఫీల్ వస్తుంది. అవి రావడానికి రీజన్ లేకున్నా నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఫోకస్ : పని మీద ఫోకస్ చేయలేరు. సింపుల్‌గా చేయాల్సిన పనులను కూడా పూర్తి చేయడం కష్టంగా ఫీల్ అవుతారు.
మూడ్ స్వింగ్స్ : మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అప్పుడే సంతోషంగా ఉంటారు. అప్పుడే బాధపడుతూ ఉంటారు.
బాధ : ఇది అన్నింటికంటే వరస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు మానసికంగా కృంగిపోతారు. బాధపడతారు. హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వొచ్చు. బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో.. ఎలా షేర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని అర్థం. వీటి గురించి ఒకరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీలోని మార్పులు మీరే గుర్తించగలుగుతారు. కానీ వాటిని దూరం చేసుకోవడం కూడా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీరు వాటిని అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.
ఫాలో అవ్వాల్సిందే..
షెడ్యూల్ : నిద్ర వచ్చినా రాకున్నా టైమ్‌కి పడుకోవడం, ఆకలి వేసినా, వేయకున్నా టైమ్‌కి తినడం, వర్క్ చేస్తూ ఉంటే.. బ్రేక్స్ తీసుకోవడం చేయండి. వీటిని మీకు నచ్చినా.. నచ్చకున్నా ఫాలో అవుతూ ఉండండి. మీరు వీటిని రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ బాడీ వీటిని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
వ్యాయామం : వ్యాయామం ఎక్కువ చేయమనట్లేదు. వాకింగ్ చేయండి. బాడీ స్ట్రెచ్ చేయండి. యోగా చేయండి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండండి. వీటివల్ల శరీలంలో ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మూడ్ రిలాక్స్ అవుతుంది. మెడ, భుజాల దగ్గర మసాజ్ చేసుకోండి. ఇవి టెన్షన్‌ని దూరం చేస్తాయి.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ : రోజూ పదినిమిషాలు డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది చాలా సింపుల్ అయినా కూడా ఎఫెక్టివ్ ఫలితాలు ఇస్తుంది. మీ నరాలకు ప్రశాంతతను అందించి.. తలనొప్పిని దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలు సైతం తగ్గుతాయి.
జర్నలింగ్ : మీ ఆలోచనలు, ఫీలింగ్స్, రోజు చేస్తున్న పనుల గురించి ఓ డైరీ రాయండి. వీటివల్ల మీరు ఏ విషయాలకు ట్రిగర్ అవుతున్నారు. ఏ విషయాలు మిమ్మల్ని హ్యాపిగా ఉంచుతున్నాయి. మీరు చేయాల్సిన పనులేంటో.. చేయకూడని పనులేంటో తెలుస్తుంది.
సపోర్ట్ : మీకు అవసరమనుకుంటే ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ లేదా మీకు పాజిటివిటీని ఇచ్చే వ్యక్తులతో మాట్లాడండి. లేదా నిపుణులను కన్సల్ట్ అవ్వండి. ఎవరితో మాట్లాడినా ఇబ్బంది పడతాను అనిపిస్తే.. మీకు నచ్చిన పని చేయండి.
ఈ టిప్స్ మీకు మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా.. మీ లైఫ్‌లో రెడ్ ఫ్లాగ్స్‌ను గ్రీన్ ఫ్లాగ్స్గా మార్చగలవు. సెల్ఫ్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. మీకు కూడా అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించండి. మీరు బాగుంటేనే.. మీ లైఫ్ అందంగా మారుతుంది. ఏది మన చేతుల్లో లేదు అనుకునే బదులు.. మీ చేతుల్లో ఉన్న కొన్ని అంశాల్లో మార్పులు చేయండి.. అన్ని మీకు అనుకూలంగా మారుతాయి.
Also Read : ఊరికే టెన్షన్ పడుతున్నారా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి వెంకీమామ చెప్పిన ఈ 4 రూల్స్‌ను ఫాలో అయిపోండి