Simple Rules for a Happier Life : The Rana Daggubati Show అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకి వచ్చిన వెంకటేష్ అండ్ మూవీ టీమ్ అంతా వచ్చారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే ఈ షోలో ఒత్తిడిని తగ్గించుకోవడంలో వెంకీమామ ఫాలో అయ్యే నాలుగు రూల్స్ కూడా చెప్పాడు. దీనిని ఎవరూ ఫాలో అయినా మెంటల్ స్ట్రెస్ తగ్గి.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇంతకీ ఆ నాలుగు రూల్స్ ఏంటో ఒత్తిడిని దూరం చేసుకోవడంలో ఇవి ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం.
వెంకీ ఆసనం అనుకునేరు..
ఎఫ్ 2 సినిమాలో వెంకటేషన్ తన స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఓ ఆసనం వేస్తారు. ఇది కూడా అలాంటిదే అనుకుంటే పొరపాటే. వెంకీ రియల్ లైఫ్‌లో ప్రశాంతంగా ఉండడానికి ఫాలో అయ్యే నాలుగు రూల్స్ ఆ ఆసనానికి ప్రత్యేకం. సినిమా రిలీజ్ సమయంలో టెన్షన్ ఉంటుందా నాన్న అని అడిగితే.. వెంకీ నో అని చెప్పి.. 4 రూల్స్ చెప్పారు. అవేంటంటే.. 1. Exert, 2. Submit, 3. Exit, 4. Accept. ఈ నాలుగు ఫాలో అయితే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు వెంకటేష్.
1. కష్టపడడం (Exert)
ఏ పని చేసినా.. దానికి ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. దీనిలో మీరు 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి పని చేయాలి. పని చేసేప్పుడు ఎలాంటి Distraction లేకుండా.. మీరు ఎంత వరకు చేయగలరో.. ఎంత మెరుగైన రిజల్ట్స్ ఇవ్వగలరో అంతా కష్టపడాలి. చేసే పనిలో ప్రాణం పెట్టి పనిచేయాలి.
2. సమర్పించండం (Submit)
చేసిన పనిని కచ్చితంగా యూనివర్స్‌కి సబ్మీట్ చేయాలి. అది సినిమా అయినా.. ఇతర వస్తువైనా, వ్యాపారమైనా.. ఏ రంగంలో ఏ పని అయినా.. చేసిన తర్వాత దానిని యూనివర్స్‌కి సబ్మీట్ చేయాల్సిందే.
3. బయటకొచ్చేయాలి (Exit)
మీరు చేసిన పని మీ చేతి నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఇంక ఆ పని గురించి ఆలోచించకూడదు. ఏదైనా మీ చేతిని దాటి వెళ్లిపోయిందంటే.. మీరు మార్చేది, చేసేది ఏమి ఉండదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆ పని, ఆలోచనల నుంచి బయటకొచ్చేయాలి.
4. అంగీకరించడం (Accept)
మీరు చేసిన పనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు చేయాల్సినంత పని చేశారు. మీకు ఎంత చేతనైందో అంత ప్రయత్నించారు. కొన్నిసార్లు మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా.. అనుకూలంగా రిజల్ట్స్ రాకపోవచ్చు. కాబట్టి రిజల్ట్ ఏది అయినా దానిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత చేసే పనిలో ముందు చేసిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండేలా చూసుకోవాలి.
ఈ నాలుగు రూల్స్.. ఏ పనికి అయినా వర్తిస్తాయి. ఎగ్జామ్స్‌కి కూడా ఈ రూల్స్ ఫాలో అయితే.. విద్యార్థులు కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 రూల్స్ ఉద్యోగులు ఫాలో అయితే వారిలో ఒత్తిడి తగ్గుతుంది. చాలామంది వర్క్ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకుంటారు. మొదటి రెండు రూల్స్‌ని చాలామంది ఫాలో అవుతారు కానీ.. తర్వాతి రెండు రూల్స్‌ని వదిలేస్తారు. అయితే ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది చివరి రెండు రూల్సేనని చెప్పారు వెంకటేష్.
ఓ పనికి ఎఫర్ట్స్ పెట్టి.. యూనివర్స్‌కి సబ్మీట్ చేసిన తర్వాత దానిని నుంచి ఎలా బయటకు రావాలో చాలామందికి తెలియదని.. మరికొందరు వచ్చిన రిజల్ట్స్‌ని యాక్సెప్ట్ చేయరని.. అదే అన్ని అనర్థాలకు దారి తీస్తుందని తెలిపారు. ఈ రూల్స్‌ని ఫాలో అవ్వడానికి తనకి ఎన్నో ఏళ్లు సమయం పట్టిందని.. అంతా ఈజీగా దీనిని ఫాలో అవ్వలేమని.. యోగా, మెడిటేషన్ కచ్చితంగా హెల్ప్ చేస్తాయని తెలిపారు.
Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్‌తో షాక్ ఇవ్వబోతున్న గవర్నమెంట్