పండుగలు, పెళ్లిళ్లు వస్తే చాలు తెలుగు ఇళ్లల్లో తరచూ వినిపించే పదం పంచభక్ష్య పరమాన్నాలు. అలాంటి ప్రత్యేక రోజుల్లో అనేక రకాల ఆహార పదార్థాలతో సుష్టుగా భోజనం చేయాలని మన పూర్వీకులు అనే వారు. ఆ భోజనానికే పంచభక్ష్య పరమాన్నాలు అనే పేరు పెట్టారు. అయిదు రకాల ఆహర పదార్థాలను కలిపి ఇలా పంచభక్ష్యాలుగా చెబుతారని అంటారు తెలుగు భాషా నిపుణులు. ఆ అయిదు రకాల ఆహారపదార్థాలు ఏంటంటే...


Also read: కంగనా వేసుకున్న ఆ నగలు, చీర ఎప్పటివో తెలుసా...


Also read: ఈ ఇంటికి కనీసం కరెంటే లేదు.. అయినా ఇన్ని కోట్ల ధర ఏంటి బాబోయ్


1. భక్ష్యాలు - కొరికి తినేవాటిని భక్ష్యాలు అంటారు. అంటే గారెలు, బూరెల్లాంటివన్న మాట. 
2. భోజ్యం - బాగా నమిలి తినేవాటిని భోజ్యం అంటారు. పులిహోర, దద్దోజనం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 
3. చోష్యం - అంటే జుర్రుకుని తినేవి. పాయసం, చారు వంటివి. 
4. లేహ్యం - నాకి తినేవాటిని లేహ్యాలు అంటారు. తేనె, బెల్లం పాకం వంటివి. 
5. పానీయం - తాగేవన్నీ పానీయాలే. కొబ్బరి నీళ్లు, నీళ్లు, పళ్ల రసాలు లాంటివన్న మాట. 


Also read: ఫిజికల్ ఫిట్‌నెస్ ఓకే.. మైండ్ ఫిట్‌గా ఉందా.. లేకపోతే ప్రాణాలకు ముప్పు


Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్


సుష్టుగా భోజనం చేయడమంటే ఇలా ఆహార పదార్థాల్లోని అన్ని రకాలను తినడమేనని మన పూర్వీకుల భావన. ఇప్పుడు ఆధునిక ఆహార  మెనూ మారిపోయింది. రెస్టారెంట్ కి వెళితే స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిసర్ట్స్, డ్రింక్స్ ఇలా రకరకాల ఆహారపదార్థాలతో మెనూ కార్డు సిద్ధంగా ఉంటుంది. వాటినే మనం పంచభక్ష్య పరమాన్నాలుగా భావిస్తున్నాం. అలాగే కొన్ని హోటళ్లలో  నార్త్ ఇండియన్ తాలి, సౌత్ ఇండియన్ తాలి పేరుతో వివిధ ఆహార పదార్థాలతో భోజనాలు వడ్డిస్తున్నారు. వీటిలో దాదాపు పంచభక్ష్యాల్లోని అన్ని రకాల పదార్థాలను వడ్డిస్తున్నారు. లేహ్యాలైన తేనె, బెల్లం పాకం వంటివి మాత్రం మిస్సవుతున్నాయి. 


Also read:అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..కంగనా వేసుకున్న ఆ నగలు, చీర ఎప్పటివో తెలుసా...


Also read: కరీనా అందం, ఫిట్నెస్ వెనుక రహస్యం ఏంటంటే...


Also read: ఏం కావాలన్నా ఇంటికే తెచ్చిపెట్టే గ్రామీణ స్టార్టప్.. డెలివరీ ఛార్జ్ ఒక్క రూపాయే