ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి పండుగను బహిరంగంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్ పండుగలకు రాని కరోనా వినాయక చవితికి వస్తుందా అని ప్రశ్నించారు. వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేసిన వారిని.. చివరికి అమ్మే వారిని కూడా అరెస్ట్ చేస్తున్నామని ఇదేం పద్దతని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఏపీలోని ఓ మద్యం దుకాణం వద్ద తీసిన ఫోటోను రఘురామకృరాజు ప్రదర్శించారు. అది ఒక్క దుకాణం వద్దేనని ఏపీలో అన్ని మద్యం దుకాణాల వద్ద కూడా అలాంటి పరిస్ధితే ఉందని.. మరి వారికి కరోనా రాదా అని ప్రశ్నించారు.
Also Read: ఏపీలో పనులుచేసేందుకు కాంట్రాక్టర్లు ఎంందుకు ముందుకు రావడం లేదు ?
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, బార్లు, జయంతులు, వర్థంతులు ఘనంగా చేస్తున్నారని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. 150 మంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి కార్యక్రమాలు చేపడుతున్నా కరోనా రాదా అని ప్రశ్నించారు. ఒక్క హిందువుల పండుగలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రజలు తననను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు వినాయకచవితి గురించి తెలియక పోతే సీనియర్ మంత్రులు , ఎమ్మెల్యేలు చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ఒక వేళ వీరెవరికీ ధైర్యం లేకపోతే... స్వరూపానంద స్వామితో చెప్పించాలని సలహా ఇచ్చారు.
Also Read : అప్పుల భారం దించుకునేందుకు మరో సలహాదారు నియామకం
జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి యాగాలు కూడా చేశానని చెప్పిన స్వరూపానంద ప్రస్తుతం కాశీలోనో మరో చోటో ఉన్నారని ఆయన వద్దకు ప్రతీ విషయానికి హుటాహుటిన వెళ్లి సలహాలు తీసుకునే దేవాదాయ మంత్రి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఎందుకు వినాయకచవితిపై ఆంక్షల విషయంలో సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సుబ్బారెడ్డి, వెల్లంపల్లి వెళ్లి జగన్‌కు స్వరూపానందతో చెప్పించాలన్నారు. టీటీడీ బోర్డుకు ఒక్క చైర్మన్ ఉంటే బోర్డు ఉన్నట్లు కాదని.. ఎవరూ లేకుండా కల్యాణ మండపాల లీజు వంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ స్వరూపానంద సలహాలు తీసుకోవాలని రఘురామ సూటించారు.
Also Read : కాంట్రాక్టర్‌పై వైసీపీ నేత దౌర్జన్యం
జగన్మోహన్ రెడ్డి మాట తప్పని తమ పార్టీ నేతలు ప్రచారం చేస్తారని కానీ అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని కొన్ని వీడియోలు చూపించారు. తాము గెలిస్తే అమరావతిలోనే అది భారీ రాజధాని కట్టి చూపిస్తామని రైతులకు ఎంతో మేలు చేస్తామని ఓ అమరావతి గ్రామంలో జగన్ ఎన్నికల సభలో మాట్లాడిన మాటలను ప్రదర్శించారు. అలాగే పెట్రో ధరలపై కూడా జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు. బాదుడే బాదుండంటూ ప్రతిపక్షంలో ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం పొరుగురాష్ట్రాల కన్నా ఎంత ఎక్కువ రేటు ఉందో వివరించారు. మడమ తిప్పడంటే ఎంటో తనకు తెలియదని కానీ మాటతప్పడు అన్నదానికి భిన్నంగా ఉందన్నారు.
తనపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన విమర్శలపైనా స్పందించారు. ఓ సభలో మాట్లాడిన గ్రంథి శ్రీనివాస్ రఘురామపై విమర్శలు చేశారు. ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని రోడ్లు పాడైనా పట్టించుకోవడం లేదన్నారు. అదే సమావేశంలో గ్రంధిశ్రీనివాస్ రోడ్ల విషయంలోనే సెటైర్లు వేశారు. ప్రయాణికులు అలవాటైపోయిందని అంటున్నారని జోకులేశారు. ఈ వీడియోను ప్రదర్శించిన రఘురామ.. ఎంపీకి రాష్ట్ర రహదారులకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సలహాదారుల మాటలను వినకుండా వాస్తవాలను చూడాలని కోరారు.