అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు, వైసీపీ నేత జయరామిరెడ్డి రోడ్డు కాంట్రాక్టర్ పై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం-కనేకల్ రోడ్డు పనులు తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులు ఎలా చేస్తున్నారని కాంట్రాక్టర్ ను బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు తప్పవని జయరామిరెడ్డి గుత్తేదారును బెదిరించారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులకు ఆమోదం వచ్చింది. నిర్మాణ పనులకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ ఈ రహదారి పనులు చేపట్టింది. అయితే స్థానిక  ఎమ్మెల్యేను సంప్రదించకుండా పనులు చేపట్టడం ఏంటని వైసీపీ నేత కాంట్రాక్టర్ పై బెదిరింపులకు దిగారు.  


చేతనైతే కంప్లైంట్ ఇచ్చుకో..


'ఏయ్ మీ వాడిని వచ్చి మాట్లాడమను. నా ఫోన్ ఎత్తడా. పనులన్నీ అపేయండి. లేకుంటే అన్ని పగులగొట్టిస్తా. చేతనైతే పోలీసు కంప్లైంట్ ఇవ్వమనండి. నాకేం కొత్తేం కాదు. నాకు తెలియకుండా పని మెుదలుపెడతారా. నేను ఎవర్ని వదలను. అన్ని వాహనాల అద్దాలు పగులగొట్టిస్తా. ఏదైనా ఉంటే వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడమనండి' అని రోడ్డు కాంట్రాక్టర్ పై  బెదిరింపులకు దిగాడు వైసీపీ నేతజయరామిరెడ్డి.  జయరామిరెడ్డి భార్య ఉషారాణి రాయదుర్గం మార్కెట్ యార్డ్  ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. 


Also Read: YCP Attack: దాడులకు భయపడేది లేదు ...నేనే స్వయంగా రోడ్లపైకి వస్తా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్


వైరల్ అయిన వీడియో


మా నాయకుడు చెప్పిందే ఇక్కడ జరగాలి. లేకుంటే భౌతిక దాడులకు దిగుతాం. ముఖ్యంగా ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండాలంటారు. ఇక ఎమ్మెల్యేలైతే నియోజకవర్గంలో ఎలాంటి వ్యవహారమైనా తమకు తెలియాల్సిందేనని పట్టుపడుతుంటారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల విషయంలోనూ కాంట్రాక్టర్ ముందుగా ఎమ్మెల్యేతో మాట్లాడాలి. ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే అనుచరుడి ఇలా బెదిరింపులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


 


Alor Read: Bypoll Politics : ఉపఎన్నిక వాయిదా వెనుక రాజకీయం ! టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరికి లాభం ?


Alor Read: చవితి వేడుకలకు అనుమతించాలని బీజేపీ నిరసన... ఉద్రిక్తంగా మారిన ఆందోళన... సోము వీర్రాజు అరెస్టు


Alor Read: అప్పుల ఒత్తిడిలో ఏపీ ప్రభుత్వం ! చక్కదిద్దుకునేందుకు సలహాదారు నియామకం..!


Alor Read: పర్యాటకులకు కనువిందు చేసిన పసుపు వర్ణం సీతాకోకచిలుకలు