కరోనా కాలంలో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో అందరికీ అర్థమైంది. ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లలనే టార్గెట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కనుక వారి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని పెట్టడం అత్యవసరం. వెజిటబుల్ పాన్ కేక్ రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం. ఇలా చేసుకుని తింటే కేవలం పిల్లలకే కాదు, పెద్దలకు చాలా ఆరోగ్యం. తయారీ కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు :
క్యారెట్ - పావు కప్పు
పాలకూర తరుగు - పావు కప్పు
క్యాబేజీ తరుగు - పావు కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చి మిరపకాయల తరుగు - ఒక టేబుల్ స్పూను
అల్లం - చిన్నముక్క
హోల్ గ్రెయిన్ ఫ్లోర్ (మార్కెట్లో దొరుకుతుంది) - వంద గ్రాములు
శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు
ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్లు
పాలు - ఒక కప్పు
గుడ్డు - ఒకటి
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూను
వంట సోడా - అర టీస్పూను
జీలకర్ర పొడి - అర టీస్పూను
తెల్ల నువ్వులు - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
తయారీ విధానం
1. హోల్ గ్రెయిన్ ఫ్లోర్, శెనగపిండి, ఓట్స్, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, వంటసోడా... ఇవన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
2. సన్నగా తరిగిన క్యారెట్, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరలను పైన కలిపిన పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
3. ఆ మిశ్రమంలో పాలు, కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. మరీ పలుచగా, అలా అని మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. అవసరం అయితే మరికొంచెం పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి.
4. పెనంపై కాస్త నూను రాసి మరీ పలుచగా కాకుండా మందంగా అట్టులా వేయాలి. రెండు వైపులా ఎర్రగా కాలాక తీసేయాలి. అంతే వెజిటబుల్ పాన్ కేక్ సిద్ధమైనట్టే.
5. దీన్ని పుదీన పెరుగు చట్నీతో తింటే బావుంటుంది. కెచప్ తో తిన్నా టేస్టీగానే ఉంటుంది.
Also read: కరీనా అందం, ఫిట్నెస్ వెనుక రహస్యం ఏంటంటే...
Also read: కంగనా వేసుకున్న ఆ నగలు, చీర ఎప్పటివో తెలుసా...
Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..