Kangana looks Stunning: కంగనా వేసుకున్న ఆ నగలు, చీర ఎప్పటివో తెలుసా...

తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది కంగనా. అందులో ఆమె చీర, నగల గురించి అభిమానులతో పంచుకుంది.

Continues below advertisement

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా తలైవి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు ఆ సినిమా తాలూకు ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా చీరలో మెరిసిపోతున్న రెండు ఫోటోలను పోస్టు చేసింది. పాత కాలంనాటి సిగతో, చక్కటి చీరకట్టుతో, మెడ నిండుగా ఉన్న హారంతో చక్కటి చుక్కలా ఉంది కంగనా. 

Continues below advertisement

 ఫోటోలో  ఆఫ్ వైట్ కాంజీవరం చీరలో, పచ్చలు నిండిన క్రస్టెడ్ నెక్ పీస్ తో స్టన్నింగ్ గా ఫోజిచ్చింది. అలనాటి నటీమణులు గుర్తుకు తెచ్చేలా ఉంది కంగనా. ఆ ఫోటోలో కనిపిస్తున్న చీర, నగలు తాను ప్రత్యేకంగా నాలుగవ జాతీయ అవార్డుల కార్యక్రమం కోసం చేయించినవని చెప్పింది. కోవిడ్ వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ చీరను కట్టుకోకుండా ఇక ఆగలేనంటూ పోస్టు పెట్టింది. ఈ చీర, నగలలో నేనెలా ఉన్నానంటూ ఫాలోవర్లను ప్రశ్నించింది. కంగనా పోస్టు పెడితే లైకులు కొట్టేందుకు ఆమె అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలా ఫోటో పెట్టిందో లేదో కొన్ని గంటల్లోనే మూడు లక్షలకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. రెండున్నరవేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఆ చీరకట్టుతో చెన్నైలో తలైవిలోని ‘నయన్ బంధే’ పాట లాంఛింగ్ కు వెళుతున్నట్టు క్యాప్షన్ పెట్టింది కంగనా. తలైవి సినిమా చేస్తున్నందున ఎక్కువగా చెన్నై చుట్టూనే తిరుగుతోంది ఈ చిన్నది. 

Also read: గాల్లో జీవితాలు.. ఎయిర్ పోల్యూషన్‌తో ఆ సమస్యలు తప్పవంటున్న తాజా అధ్యయనం

తలైవి సినిమా చేస్తున్నప్పటి నుంచి అలనాటి నటీమణుల్లా ముస్తాబై ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది కంగనా. అంతకుముందు  ఎరుపు రంగు అంచున్న నారింజ రంగు చీరలో ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు కనుల విందు చేసింది. 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా కంగనా నటించిన తలైవి సినిమా ఈ నెల 10న థియేటర్లలోకి విడుదల కానుంది. దీనికి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. సినిమా విడుదలైన కొన్ని రోజుల తరువాత అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్.  కంగనా ఆ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 

Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ అపోహలు నమ్మకండి

Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..

Continues below advertisement