మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను దర్శకుడు శంకర్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీ15 పేరుతో ఉన్న ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం చూస్తే.. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఈ నెల 8న అఫీషియల్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పాన్ ఇండియా నటి కియారా అద్వానీ నటించనున్నట్లు సమాచారం.
ఈ మూవీ లాంచ్ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హాజరవుతారని లీకులు వెల్లడించాయి. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఆర్‌సీ15 సినిమాకు ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ చిత్రంగా ఆర్‌సీ15 తెరకెక్కనుంది. 2022 కల్లా ఈ సినిమా పూర్తి కానుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
దర్శకుడు శంకర్ 58వ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. ఈ పోస్టులో ఆర్‌సీ15 అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమా శంకర్‌తో చేయనున్నట్లు రూమర్లు వచ్చాయి. ఈ మూవీ మేకర్లు సినిమా పోస్టర్ రిలీజ్ చేశారంటూ ఒక పిక్చర్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌కు శుభం కార్డు పలికారు.