ఆ ఇంటికి ఇంటర్నెట్.. లేదు.. స్విచ్ ఆన్ చేద్దామనుకున్నా.. కరెంట్ లేదు. అయినా ధర మాత్రం కోట్లలో. ఎందుకు అలా తెలుసా. ఆ ఇల్లు ఉండే ప్రదేశం అలాంటిదన్నమాట. అసలు అక్కడ ఉంటే.. అంతకుమించిన రిలాక్సేషన్ ఇంకోటి ఉండదు అన్నట్టు ఉంటుంది. అలాంటి సుందరమైన ప్రదేశం అది. ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఎంతో ప్రశాంతంగా జీవించొచ్చు.
హే.. అలాంటి హోమ్.. ఈ కాలంలో ఎక్కడిది అనుకుంటున్నారా? ఉందండి. ఎక్కడో తెలుసా.. యునైటెడ్ కింగ్ డమ్ లో. కొంతమంది ఈ ఇంటిని ఆఫ్ గ్రిడ్ హౌస్ అని పిలుస్తారు... మరికొంతమందేమో.. డెవాన్ సుముద్రపు కాటేజ్ అంటారు. ఈ కాటేజ్‌కు విద్యుత్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ దరిదాపుల్లో లేదు. అయినా.. దాదాపు రూ.5.56 కోట్లకు అమ్మకానికి పెట్టాడు దాని ఓనర్.
బ్లూ సీ కి సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండటమే దీని స్పెషాలిటీ. ఈ కాటేజ్ నేషనల్ ట్రస్ట్ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌పైన ఉన్న రిమోట్ గేట్‌అవేలో ఉన్నది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని ఆస్వాదించుకోవాలనుకునే వారికి ఈ కాటేజ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట. అక్కడికి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే.
ఈ కాటేజ్‌లో రెండు పెద్ద బెడ్ రూంలు ఉన్నాయి. పైన ఒక గడ్డితో చేసిన గది ఉన్నది. ఇందులో లాంజ్, డైనింగ్ రూం, ఫ్రంట్ అండ్ బ్యాక్ వరండా, రెండు గెస్ట్ బెడ్‌రూంలు, పవర్‌రూం, వంట గదులు ఉన్నాయి. ఈ కాటేజ్‌ను 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
కరెంటు లేకుండా మరి ఇంట్లో చలి వాతావరణం నుంచి వేడి కావాలంటే... 2 మల్టీ ఫ్యూయల్ బర్నర్లు ఉన్నాయి.
కిచెన్‌లో గ్యాస్ కుక్కర్, ల్యాంప్స్ ఉన్నాయి. ఎల్ పీజీ గ్యాస్ సప్లై ఉంది. ఇంటి పైన వర్షపు నీటిని మంచి నీరుగా మార్చే వ్యవస్థ ఉంది. దాని ద్వారా నీరు సంపాదించుకోవచ్చు. సముద్రం దగ్గరకు కారులో వెళ్లొచ్చని ఇంటి ఓనర్ మిషెల్లే స్టీవెన్స్ తెలిపారు. అయితే కార్ పార్కింగ్ ప్లేస్ ఇంటికి దూరంగా ఉంది. అక్కడ పార్క్ చేసి ఇంటికి నడుస్తూ వెళ్లడానికి పావుగంట పడుతుందట. అయితే కొనడానికి ముందుకొచ్చిన వారు.. ఈ విషయాలు చూసి ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు.
Also Read: Old Coins: రండి బాబు రండి.. ఈ 5, 10 రూపాయల కాయిన్స్ ఉంటే రూ.10 లక్షలు మీవే