May Day 2024 Theme and Interesting Facts : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కష్టాన్ని, సహకారాన్ని గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడే చేస్తారు. దీనినే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. కార్మికుల సహకారాన్ని గుర్తుచేయడమే కాకుండా.. కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ.. సమాజానికి వారు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఇంతకీ అసలు ఈ మే డే ఎప్పుడు మొదలైంది. దాని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటి? కార్మికుల దినోత్సవం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మే డే చరిత్ర ఇదే..


కార్మిక దినోత్సవాన్ని  19వ శతాబ్ధం నుంచి యూనైటెడ్ స్టేట్స్ నిర్వహించినట్లు చరిత్ర చెప్తోంది. దానికి బీజం 1886లో ప్రారంభమైంది. 1886లో మే 1వ తేదీన దాదాపు రెండు లక్షలమంది కార్మికులు.. తమ శ్రమను గుర్తిస్తూ.. రోజుకు ఎనిమిది గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెను చేశారు. ఆ సమయంలో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. 


బాంబు పేలుడుతో మలుపు తీసుకున్న ఉద్యమం


చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్​లో కార్మికులు శాంతియుత సమావేశమయ్యారు. ఆ సమయంలో బాంబు పేలడంతో అది విషాదకరంగా మారిపోయింది. ఎందరో నిరసనకారులు, పోలీసులు ఈ పేలుడులో ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి ఈ కార్మికుల ఉద్యమం, హేమార్కెట్ ఘటనను గౌరవిస్తూ.. మే డేని చేయడానికి సిద్ధమయ్యారు. దుర్ఘటన 1886లో జరగగా.. 1889 మే 1వ తేదీన కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్​లో నిర్వహించారు. 1890 నుంచి అధికారిక వేడుకలు నిర్వహించారు. 


సెలవుదినం.. వేడుకల నిర్వహణ


దాదాపు అనేక దేశాలలో మేడేను సెలవుదినంగా ప్రకటించాయి. కార్మికుల విజయాలు, సహకారాన్ని గుర్తిస్తూ.. అనేక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కార్మికులు వారి హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేస్తారు. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్రను గురించి చెప్తారు. కార్మికులు తరచుగా ఏ విధంగా దోపికిడికి గురి అవుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారనే విషయాలను తెరపైకి తీసుకువస్తారు. అందుకే ఈ కార్మిక దినోత్సవాన్ని.. ఇండియాతో సహా 80కి పైగా దేశాలు మేడేని నిర్వహిస్తున్నాయి. 


మేడే ప్రాముఖ్యత ఇదే


దేశ నిర్మాణంలో కార్మికులు చేసిన కృషిని గుర్తిస్తారు. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల శ్రమను గుర్తించడమే కాకుండా.. వారి హక్కులను గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తారు. శ్రమదోపిడికి గురికాకుండా.. వారిని రక్షించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. ప్రతి కార్మికుడికి.. పని చేసే ప్రాంతంలో మెరుగైన పరిస్థితులను, పురోగతి అందించడమే దీని ప్రధాన లక్ష్యం.



కార్మిక దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే..


ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజు కొత్త థీమ్​తో వస్తారు. మే డే రోజు కార్మికుల విజయాలను గుర్తించి.. వారి హక్కులను గుర్తు చేసి.. కార్మికుల భవిష్యత్తును ప్రోత్సాహించడమే లక్ష్యమే థీమ్​గా తీసుకువస్తున్నారు. ఇప్పటికీ.. కొన్ని పరిశ్రమలలో కార్మికులు అసమానతలకు గురవుతున్నారు. అందుకే కార్మికులు సామాజిక న్యాయం కోసం పోరాడేలా చేయడమే లక్ష్యంగా కార్మికుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 


Also Read : కోవిషీల్డ్ వ్యాక్సిన్​ వేయించుకున్నారా? అయితే జాగ్రత్త మీ రక్తం గడ్డకట్టే అవకాశముందట.. మరెన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా