ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఉద్యోగస్తులు బర్న్ అవుట్ బారిన పడతారు. అయితే ఉద్యోగం చేసే పెళ్ళైన మగవాళ్ళు బర్న్ అవుట్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుత రోజుల్లో వర్క్ ప్లేస్ లో బర్న్ అవుట్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అది ఉద్యోగి పనితీరు, శ్రేయస్సు, పని చేసే ఆర్గనైజేషన్ ఉత్పాదకత మీద హానికరమైన ప్రభావం చూపుతుంది. రష్యాలోని నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ బృందం నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. వ్యక్తిగత సంబంధాల పట్ల సంతృప్తిగా ఉన్న పురుషులు వర్క్ ప్లేస్ బర్న్ అవుట్ సిండ్రోమ్ మారిన తక్కువగా పడే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.


బర్న్ అవుట్ మానసిక అలసటకి కారణమవుతుంది. అంతే కాదు భావోద్వేగ అలసట, వ్యక్తిగత ఆలోచనలు గాడి తప్పడం, ఆలోచనా విధానంలో మార్పులు చోటు చేసుకుంటారు. ఈ అధ్యయనం కోసం వివిధ రష్యన్ కంపెనీలలో పని చేస్తున్న 203 మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉద్యోగులు వ్యక్తిగత సంబంధాలు, కార్యాలయ పని ఒత్తిడి ఏ విధంగా ప్రభావితం చేసిందో అడిగి తెలుసుకున్నారు. వైవాహిక సంతృప్తి ఉన్న వాళ్ళు బర్న్ అవుట్ లక్షణాల బారిన తక్కువగా పడినట్టు తేలింది. వివాహం, వృత్తికి సంబంధించిన వైవిధ్యాలతో పాటు పురుషులు, స్త్రీలు పాటిస్తున్న పద్ధతలు, కెరీర్ లో వాళ్ళకి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రియాలిటీకి వచ్చే సరికి అది సరిపోలుతుందా? లేదా అనే వివిధ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.


బర్న్-అవుట్ అంటే?


అతిగా ఆఫీసులో పనిచేసేవారిలో ఏర్పడే ఒక మానసిక పరిస్థితే ‘బర్న్ అవుట్’. అది మూడు రకాలుగా ఉంటుంది. అతిగా పని చేయడం వల్ల ఒత్తిడి వల్ల ఏర్పడే శక్తి క్షీణత, లేదా అలసటగా ఉండటం, ఉద్యోగం వల్ల ఏర్పడే మానసిక ఆందోళన, ప్రతికూలత లేదా విరక్తి భావాలను ‘బర్న్ అవుట్’గా పేర్కొంటారు. 


పురుషుల్లో ఇలా..


పురుషుల విషయంలో వారి కెరీర్ విజయాలు, వారి గుర్తింపు విషయంలో సంతృప్తికరంగానే ఉంటున్నారు. అంతే కాదు కార్యాలయంలో వాళ్ళు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విధులని నెరవేర్చడానికి అంచనాలు అందుకోవడానికి అధిక ఒత్తిడి అనుభవిస్తున్నారు. కానీ వైవాహిక సంతృప్తి వ్యక్తిగత జీవితంలో మద్ధతు ఉన్న పురుషులు బర్న్ అవుట్ ని నిరోధించగలుగుతున్నారు.


మహిళల్లో అలా..


ఇక మహిళల విషయానికి వస్తే సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి సరైన మద్ధతు లేకపోవడం వంటి అంశాల కారణంగా బర్న్ అవుట్ అభివృద్ధి ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మహిళలు వ్యక్తిగతంగా ఎక్కువగా విమర్శల పాలు కావడం, సామాజికంగా వారి మీద వస్తున్న ఒత్తిడి వంటి పాత్రలతో ఈ సిండ్రోమ్ ముడిపడి ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల అందించే భావోద్వేగ మద్ధతు గురించి మహిళలు తరచుగా ఒత్తిడి అనుభవిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా బాధ్యతల నుంచి వైదొలిగే ధోరణి ఏర్పడుతుంది. అటువంటి నిర్ణయాలు పనితీరు, సహోద్యోగులతో ఉండే సంబంధంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఎక్కువ వృత్తిపరమైన విజయాన్ని అందించే పురుషులు తమ వ్యక్తిగత సంబంధాలతో అధిక స్థాయి సంతృప్తిని కలిగి ఉంటారని పరిశోధనలు వెల్లడిస్తాయి. మహిళల్లో అలాంటి సంబంధం ఏది కనుగొనబడ్లేదు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో పని చేసే చోట విజయాన్ని అందుకోవడంలో ఒక మెట్టు ఎక్కువే ఉంటున్నారు. ఇది వారి వ్యక్తిగత జీవితంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందేM