Manisha Koirala: 'బొంబాయి' సినిమాలోని ఉరికే చిలుక పాటకి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆ పాట విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే, ఆ పాట షూట్ చేసేందుకు మాత్రం సినిమా టీమ్ చాలా కష్టపడిందట. లొకేషన్ కి చేరుకునేందుకు అడవిలో నడవాల్సి వచ్చిందని, చెట్ల మధ్యలో తిరగాల్సి వచ్చిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మనీషా కోయిరాల. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్పాట్‌కు చేరుకున్నామని అన్నారు. లొకేషన్ మొత్తంలో జలగలు ఉన్నాయని, అవన్నీ కాళ్ల నిండ ఎక్కాయని చెప్పారు మనీషా. ఇక వాటి నుంచి కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అసలు జలగలు కుడితే ఏమవుతుంది? జలగల నుంచి ఎలా కాపాడుకోవాలి? అని డాక్టర్లు ఈ సూచనలు చేస్తున్నారు.
జలగలు కుడితే ఏమవుతుంది?
జలగలు కుడితే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, అది కుట్టినప్పుడు కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. అయితే, జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఒంట్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. జలగలు వానపాము కుటుంబానికి చెందినవే. చల్లటి ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో జలగలు ఉంటాయి. దీంతో అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– రక్షణ ఇచ్చే దుస్తులు వేసుకోవాలి..
చేతులు పొడవు ఉన్న షర్ట్స్, ఫుల్ ప్యాంట్లు వేసుకోవాలి. సాక్స్ వేసుకోవాలి. ప్యాంట్ ని సాక్స్ లోకి టక్ చేసుకుంటే మంచిది. ఫుల్ గా కవర్ అయ్యేలా బూట్లు వేసుకుంటే జలగలు చర్మాన్ని పట్టుకోకుంటాయి ఉంటాయి.
లీచ్ రెపలెంట్..
జలగలు కరవకుండా, దగ్గరికి రాకుండా కొన్ని రెపలెంట్స్ ఉంటాయి. వాటిని వాడితే మంచిది. DEET లేదా యూకలిప్ట్స్ నూనె, టీ త్రీ ఆయిల్ లాంటివి వాడితే మంచిది. వాటిని ఒంటికి, బట్టలకు పూసి వాడొచ్చు.
ఉప్పు, వెనిగర్..
ఉప్పు, వెనిగర్ రెండూ జలగలని చర్మానికి అంటనివ్వకుండా చేస్తాయి. అందుకే, బట్టలు, బూట్లు, సాక్స్ కి ఉప్పు లేదా వెనిగిర్ పూయాలి.
గడ్డిలో నడవకపోవడం మంచిది..
జలగలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు గడ్డిలో నడవకపోవడం మంచిది. క్లియర్ గా, దారి సరిగ్గా ఉన్న ప్రదేశాల్లో నడవటం ఉత్తమం.
జలగలు అంటుకుంటే తీయడం ఎలా?
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. జలగలు అంటుకుంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా వాటిని తీసేయాలి. లేదంటే ఇన్ ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది. మరి జలగలని జాగ్రత్తగా ఎలా తీయాలంటే?
- సెలైన్ సొల్యూషన్ లేదా ఉప్పుని చల్లి జలగలని చర్మం నుంచి విడదీయాలి. వాటివల్ల జలగలకి ఇరిటేషన్ వచ్చి సహజంగానే చర్మాన్ని వదిలేస్తుంది.
- వెనిగర్ లేదా ఆల్కహాల్ ని పూస్తే జలగ గ్రిప్ ని కోల్పోయి తొందరగా వదులుతుంది.
- సమయానికి అవేమీ అందుబాటులో లేకపోతే.. వేలి గోటితో లేదా క్రెడిట్ కార్డు కొసతో జలగని తీసి పడేయాలి.
హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్లాలి?
చాలా వరకు జలగలు ఆరోగ్యానికి హాని కలిగించవు. కానీ, కొన్నిసార్లు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాలి.
- జలగ కరిచిన దగ్గర ఎర్రగా మారినా, వాపు వచ్చి నొప్పి కలిగినా కచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాలి. లేకపోతే ఇన్ ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.
- ఒక్కోసారి జలగ కుట్టిన తర్వాత కొంతమందికి ఎలర్జీ వస్తుంది. తుమ్ములు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముఖం, గొంతు వాపు రావడం, నీరసం లాంటివి ఉంటే కచ్చితంగా వెంటనే.. డాక్టర్ ని సంప్రదించాలి.
- జలగ కరిచిన తర్వాత బ్లీడింగ్ అవుతున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
- జలగ కరిచిన తర్వాత జ్వరం, చలిగా అనిపించడం, ఫ్లూ లాంటివి స్తే అది సెకండరీ ఇన్ ఫెక్షన్ కి దారి తీసే అవకాశం ఉంది. అందుకే, వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది.
Also Read: ఈ ఒక్క మసాలా దినుసుతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో.. లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.