రంతా తిరిగి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లో అడుగు పెడితే మన పెద్దలు ఏమంటారో మీకు తెలిసిందే. కనీసం షూస్ ధరించి బయటకు వెళ్లినా కాళ్లు కడిగి ఇంట్లోకి రావాలని చెబుతారు. అయితే, ఈ వ్యక్తి కాళ్లకు షూస్, చెప్పల్స్ వంటివి ఏవీ ధరించడు. అలా చేస్తే అతడి ఆదాయానికి గండిపడుతుంది. అదేంటీ? కాళ్లు కడిగితే డబ్బులు పోతాయా? ఇదేం నమ్మకం అని ఆశ్చర్యపోతున్నారా? అది నమ్మకం కాదు.. సోషల్ మీడియా పిచ్చి. ఔనండి, అతడి మురికి కాళ్లకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. చాలామంది అతడి మురికి కాళ్లకు డబ్బులు చెల్లిస్తు్న్నారు. ఈ యాపారం ఏదో బాగుందే మనమూ చేద్దాం అనుకుంటున్నారా? మన దేశంలో ఇలా చేస్తే ఒక్క పైసా కూడా సంపాదించలేరు. ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే అతడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి.


కోటీశ్వరుడు కావాలనే లక్ష్యంతో...: యూకేకు చెందిన 20 ఏళ్ల జార్జ్ వుడ్‌విల్లే.. ఏ పని చేయకుండా కోటీశ్వరుడు కావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇందుకు అతడికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? ఎలాంటి పాదరక్షణలు ధరించకుండా నడవడం, కాళ్లను మురికి చేసుకోవడం. అతడు తన ఐడియాను స్నేహితులతో పంచుకున్నప్పుడు చాలా క్రేజీగా అనిపించింది. కానీ, అతడు చేస్తున్న పని చూసి ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. అతడు తన కాళ్లను మురికిగా ఎందుకు ఉంచుకోవాలని అనుకుంటున్నాడో తెలుసుకుని స్నేహితులంతా ఆశ్చర్యపోతున్నారు. జార్జ్ తన మురికి కాళ్ల ఫొటోలను OnlyFans వెబ్‌సైట్లో పెట్టుకుని విక్రయిస్తున్నాడు. అయినా, మురికి కాళ్లను ఎవరు కొంటారులే అని మీరు అనుకుంటున్నారా? చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు అతడి మురికి కాళ్ల ఫొటోలను కొనేందుకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఫాలోవర్లు ఎగబడుతున్నారు. 


ఇది వినేందుకు కాస్త చిత్రంగానే ఉండవచ్చు. కానీ, జార్జ్.. కొంతమందిలో ఉండే విచిత్రమైన కోరికలను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని మొదలుపెట్టాడు. గత పది నెలలుగా అతడు షూస్ ధరించడం లేదు. మరణించే వరకు తాను పాదరక్షణలు వేసుకోనని, కాళ్లు కడగడనని ప్రతిజ్ఞ చేశాడు. గతేడాది అక్టోబర్ నెలలో తన కుటుంబంతో కలిసి ప్లైమౌత్‌కి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన జార్జ్.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడే తన పాదరక్షణలు విసిరేశాడు. 


ఆ రోజు నుంచి అతడు బార్‌లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్‌లు, నైట్‌క్లబ్‌లలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. ‘టిక్‌టాక్‌’లో కూడా జార్జ్‌కు అకౌంట్ ఉంది. అందులో చాలామంది అతడి మురికి కాళ్ల ఫొటోలు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో జార్జ్.. ఓన్లీ‌ఫ్యాన్స్ అకౌంట్ ద్వారా వారి కోరిక తీరుస్తున్నాడు. ప్రస్తుతం అతడి ప్రయత్నానికి డబ్బులు బాగానే వస్తున్నాయి. అది విజయవంతంగా కొనసాగితే త్వరలోనే తాను కోటీశ్వరుడిని అయిపోతానని చెబుతున్నాడు. అయితే, చలికాలంలో చెప్పులు లేకుండా తిరగడం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు అలవాటైపోయిందని అంటున్నాడు. మరి, జార్జ్ కోటీశ్వరుడు అయ్యేసరికి ఆ పాదాలు అలాగే ఉంటాయో.. ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతాయో చూడాలి.


Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!


Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!