రోజుల్లో ఎవరూ హోటల్‌కు వెళ్లి టిఫిన్లు, భోజనాలు చేయడం లేదు. ఆర్డర్ పెడితే చాలు.. అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. పైగా.. ఫుడ్ యాప్స్‌లో ఆఫర్లు కూడా బాగానే ఇస్తారు. కూపన్ అప్లై చేస్తే.. చాలా తక్కువ ధరకే ఆ ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే, ఇది ఇప్పటివరకు ప్రజలకు ఉన్న అభిప్రాయం. కానీ, ముంబయికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఈ కంపేరిజన్ చూసిన తర్వాత.. మనం ఇలా మోసపోతున్నామా? ఇన్నాళ్లు కూపన్ల పేరుతో వస్తున్న ఆఫర్లన్నీ హంబక్కేనా అని ఆశ్చర్యపోతారు. వాస్తవానికి మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్న ఫుడ్ ధరలకు, హోటల్‌లో వసూల్ చేసే నిజమైన ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇతడు ఆ విషయాన్ని ఫొటోలతో సహా వివరించాడు. అయితే, ఈ పోస్ట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


రాహుల్ కాబ్రా అనే వ్యక్తి Zomato నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌ బిల్లును.. అదే ఆహారాన్ని నేరుగా హోటల్‌కు వెళ్లి కొనుగోలు చేస్తే అయ్యే బిల్లును పోల్చాడు. ఆ రెండు ఫొటోలను LinkedInలో పోస్ట్ చేశాడు. ఈ బిల్లుల మధ్య వ్యత్యాసం చూసి షాకయ్యారు. రెండు బిల్లులకు మధ్య సుమారు రూ.200 వరకు తేడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. పైగా, జొమాటాలో పేర్కొన్న ఆహార ధరలు హోటల్ ధరలు కంటే ఎక్కువ ఉన్నాయి.  


ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్ Zomato ఒక ఆర్డర్‌పై ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకోడానికి ఈ బిల్లులే నిదర్శనమని అతడు పేర్కొన్నాడు. వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను జొమాటో ద్వారా ముంబైలోని తూర్పు కాండివాలిలోని ‘ది మోమో ఫ్యాక్టరీ’ నుంచి ఆర్డర్ చేశాడు. నేరుగా హోటల్‌కు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆ ఫుడ్‌కు మొత్తం రూ.512 అయ్యింది. జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన అదే ఫుడ్‌కు రూ.764 అయ్యింది. దానికి కూపన్ వర్తిస్తే.. రూ.75 తగ్గి, మొత్తం రూ.690 అయ్యింది. కూపన్ అప్లై చేసినా సరే, నేరుగా కొనుగోలు చేసిన ఆహారం కంటే అదనంగా రూ.178 ఎక్కువ అయ్యింది. అంటే, ఆన్‌లైన్‌లో ఆ ఆహారం విలువను 34.76 శాతానికి పెంచాడని రాహుల్ తెలిపాడు. 
 
అయితే, దీనిపై నెటిజనులంతా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో Zomato తప్పులేదని, రెస్టారెంట్ భాగస్వాములే ఆన్‌లైన్‌లో తమ ఆహారాన్ని విక్రయించేందుకు ధరలను రెట్టింపు చేశారని పలువురు తెలుపుతున్నారు. రెస్టారెంట్ యజమానులు అదనపు కమీషన్ కోసం ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని అంటున్నారు. ‘‘ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ ధరలు గణీయంగా పెరిగాయి. వాటిని కూడా మీరు పరిగణించాలి. మీకు అదనంగా ఖర్చవుతుందని భావిస్తే అలాంటి యాప్స్‌ను వినియోగించకుండా నేరుగా వెళ్లి కొనుగోలు ఫుడ్ కొనుగోలు చేయడమే బెటర్’’ అని మరికొందరు అంటున్నారు. ‘‘వారు ఫుడ్ మెనూలోని ఆహార ధరలను అలాగే ఉంచి, సర్వీసు కోసం అదనంగా డబ్బులు వసూలు చేసి ఉంటే ఇలాంటి ఫిర్యాదులు ఉండవు. ఫుడ్ రేట్లు పెంచి చూపించడం వల్లే ఈ వివాదమని మరొకరు వ్యాఖ్యానించారు.

 


ఈ పోస్ట్‌పై Zomato కూడా స్పందించింది. ‘‘హాయ్ రాహుల్, జొమాటో కస్టమర్, రెస్టారెంట్ మధ్య మధ్యవర్తిత్వ ప్లాట్‌ఫారమ్‌గా మాత్రమే పనిచేస్తుంది. మా ప్లాట్‌ఫారమ్‌లో రెస్టారెంట్ భాగస్వాములు అమలు చేసే ధరలపై ఎటువంటి మాకు ఎలాంటి నియంత్రణ లేదు. మీ అభిప్రాయాన్ని మేము.. వారికి తెలియజేశాం. దీన్ని పరిశీలించాలని వారిని అభ్యర్తించాం’’ అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. రెస్టారెంట్ యాజమాన్యమే రెండు రకాల ధరలను కస్టమర్లపై రుద్దుతుందని అర్థమవుతుంది. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘రెస్టారెంట్లు నేరుగా వెళ్లి కొనుగోలు చేస్తే ఒక ధర, జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తుంటే మరో ధరను కమీషన్ కోసం వసూళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఇంటికి వచ్చి ఫుడ్ ఇచ్చే ‘జోమాటో’ సర్వీస్ ప్రొవైడర్‌ తప్పులేదని అర్థమవుతుంది. Zomato ఇస్తున్న ఆ కూపన్ల వల్ల కొంతవరకైనా డబ్బు ఆదా అవుతుంది. ఆ కూపన్స్ లేకపోతే.. ఇంకా రెట్టింపు డబ్బులను చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. 


Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!


Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?