కారు కొనాలని అనుకోవడం ప్రతి ఒక్కరి కల. డబ్బున్న వాళ్ళకి అయితే అది చిటికెలో పని కానీ సామాన్యులకి మాత్రం అది చాలా కష్టంతో కూడుకున్నది. ఎంతో కష్టపడి డబ్బు కూడగట్టి దానితో కొత్త కారు కొంటె వచ్చే సంతోషం వెలకట్టలేనిది. దాని పక్కన నిలబడి ఫోటోస్ దిగి సోషల్ మీడియాలో పెట్టుకుని చాలా సంతోషిస్తారు. ప్రస్తుతం అదే సంతోషంలో ఉన్నాడు ఓ వ్యక్తి. లింక్డ్ ఇన్ లో తన సంతోషాన్ని పంచుకుంటూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. మాజీ ప్రియురాళ్లకు, మాజీ బాస్, కూరగాయలు అమ్మే వాళ్ళకి థాంక్స్ చెప్పాడు. అంతా బాగానే ఉంది కదా మరి ఇంకేంటి సమస్య అని అనుకుంటున్నారా? కానీ అక్కడే వచ్చింది ఓ చిక్కు. ఆ పోస్ట్ చూసి అందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకో మీరే తెలుసుకోండి.
“నేను టాటా టియాగో కొన్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎటువంటి లోన్, అప్పు చెయ్యకుండా పూర్తి డబ్బులు చెల్లించి కారు కొనుక్కున్నా. నేను ఈ కారు కొనుక్కోదానికి సంవత్సరాలు తరబడి డబ్బు ఆదా చేశాను. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళేవాడిని కాదు. గర్ల్ ఫ్రెండ్స్ లేదా భార్యకి ఖరీదైన బహుమతి ఇవ్వలేదు. కూరగాయలు తెమ్మని మా అమ్మ డబ్బులు ఇచ్చేది. పచ్చి మిరపకాయలు, కొత్తిమీర ఉచితంగా ఇవ్వమని ఆ కూరగాయల షాపు వాళ్ళని అడిగేవాడిని. అలా ఇస్తే రూ.10 ఆదా అవుతాయి కదా అని తెలిపాడు.
‘‘నేను రాత్రి పూట వాచ్ మెన్ గా అదనపు షిఫ్ట్ చేసేవాడిని. కొన్ని సార్లు మెక్ డొనాల్డ్ లో పని చేశాను. మరి కొన్ని సార్లు యూపీఎస్సి అభ్యర్థులకి ట్యూషన్ చెప్పేవాడిని. కష్టపడి పని చేసినందుకు ఫలితం దక్కింది. ఇన్నాళ్ల నా నిరీక్షణ ముగిసింది. పొదుపు చేసిన డబ్బుతో కారు కొనుగోలు చేశాను. నా తల్లి దండ్రులకి, నా మాజీ గర్ల్ ఫ్రెండ్స్, నా మాజీ బాసులకి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా” అని మధుర్ సింగ్ అనే వ్యక్తి రాసుకొచ్చాడు.
అయితే ఈ పోస్ట్ నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే అందులో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ అన్నాడు మళ్ళీ భార్య అన్నాడు. ఇంతకీ అతనికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేక భార్య ఉందా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ పోస్ట్ లో ఏముందనో ఏమో గాని దానికి 20 వేల రియాక్షన్స్, 1700 కామెంట్లు వచ్చాయి. అయితే ఇది చదివిన చాలా మంది ఇదొక నాటకం నిజం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూపీఎస్సీ అభ్యర్ధులకి కోచింగ్ ట్యూషన్ చెప్పగలిగే సత్తా ఉన్నవాడు వాచ్ మెన్ గా ఎందుకు చేయాల్సి వస్తుందని అనుమానపడుతున్నారు. మీకు గర్ల్ ఫ్రెండ్, భార్య ఇద్దరు ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో ధైర్యంగా చెప్పారంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇది నిజమంటారా, అబద్ధం అంటారా? ఏది ఏమైనా వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ని ఒకేసారి మ్యానేజ్ చేస్తూ ధైర్యంగా బయటకి చెప్పావంటే నువ్వు మగజాతి ఆణిముత్యం అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!