కప్పుడు టాయిలెట్లు ఇళ్లకు దూరంగా ఉండేవి. పల్లెల్లో ప్రకృతే పెద్ద టాయిలెట్. కాలక్రమేనా ఇంటి వెనుక టాయిలెట్లు కట్టుకోవడం ప్రారంభించారు. స్థలం కొరత, మరింత సదుపాయం కోసం ఇప్పుడు ఇంట్లోనే టాయిలెట్లు కడుతున్నారు. కాస్త డబ్బు ఉన్న వాళ్ళు అయితే వెస్ట్రన్ లావేట్రీస్(కమోడ్)పెట్టించుకుంటున్నారు. ఆఫీస్‌లో కూడా ఇవే టాయిలెట్స్ ఉంటున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది ఇళ్ళల్లో ఇవే కనిపిస్తున్నాయి. ఇండియన్ లావేట్రీస్ వినియోగం తగ్గింది.


చాలా మంది బాత్రూంకి వెళ్ళి ఎక్కువసేపు కమోడ్ మీద అలాగే కూర్చుని ఉంటారు. ఫోన్ తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి చూసుకుంటూ సమయం అనేది పట్టించుకోకుండా అలాగే కూర్చుని ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిలిస్తే అప్పుడు బయటకి వస్తారు. గంటలు గంటలు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావని ఎవరు అడగలేరు. అందుకే ఎక్కువ మంది బాత్రూమ్ కి వెళ్ళి ఫోన్ చూసుకోవడం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్/ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు.


మీకు కూడా ఇదే అలవాటు ఉందా? టాయిలెట్‌కు వెళ్ళి ఎక్కువసేపు కూర్చుంటున్నారా? అయితే జర భద్రం. ఎందుకంటే అలా ఎక్కువసేపు కమోడ్ మీద కూర్చుని ఉండటం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు.


ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ ప్రజలు వారానికి మూడున్నర గంటలు టాయిలెట్ లో కూర్చునే గడిపేస్తున్నారంట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా! కానీ అలా ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సుమారు 5 నిమిషాలకి మించి ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చోకూడదు. ఎందుకంటే అలా ఎక్కువసేపు కూర్చోవడం హానికరం. ఇది మీకు హెమరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్నే పైల్స్ లేదా మూలశంఖ సమస్య అని కూడ అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది.


సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. దీని వల్ల కొంతమంది మల విసర్జన చెయ్యడానికి  చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సమయంలో బలం ఎక్కువగా ఉపయోగించి విసర్జన చెయ్యడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. టాయిలెట్ లో ఎక్కువసేపు గడిపితే మల సిరల్లో రక్తం చేరి హెమరాయిడ్స్ కి దారి తీస్తుంది. అవి పెద్ద సమస్యగా మారి ఆపరేషన్‌కు దారితీస్తుంది. మల విసర్జన సక్రమంగా జరగాలంటే మీరు తినే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


శరీరానికి రోజుకి కనీసం 2 -30 గ్రాముల ఫైబర్ అవసరం ఉంటుంది. అందుకే పండ్లు, కూరగాయలు మీ డైట్ లో భాగం చేసుకోవాలి. అంతే కాదు మలబద్ధకం నుంచి బయట పడాలంటే నీరు ఎక్కువ తీసుకోవాలి. పైల్స్ బాధిస్తుంటే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అక్కడ నొప్పిగా అనిపిస్తే పారాసిటమాల్ తీసుకోవడం మంచిది. ఇది నొప్పి నుంచి మీకు ఉపశమనం కలిగేలా చేస్తుంది. నొప్పి బాగా ఎక్కువగా అనిపించినప్పుడు ఆ ప్రదేశంలో కొద్దిగా ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. మలబద్ధకాన్ని నివారించడానికి ఆల్కహాల్, కెఫీన్‌కు దూరంగా ఉండాలి. 


Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే


Also Read: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్