సీజనల్ పండ్లు, కూరగాయలను కచ్చితంగా తినాలి. ఆ సీజన్లో వచ్చ వ్యాధులను తట్టుకునే శక్తిని అవి అందిస్తాయి. వేసవిలో వచ్చేవి మామిడి కాయలు. పుల్లని మామిడికాయలతో చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వేసవిలో చేసుకుని తింటే చాలా మంచిది. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. మామిడి కాయలు తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఇవి అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్లు రావని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మామిడితో చేసిన వంటలు తినడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. వేసవి తాపాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఇది ముందుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలు బలంగా మారేందుకు, కాలేయ ఆరోగ్యానికి, చర్మానికి కూడా మామిడి కాయ మేలు చేస్తుంది. రోజూ సాంబారు, రసం చేసుకునే అలవాటున్న వారు కాస్త కొత్తగా పప్పు మామిడిరసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 

కావాల్సిన పదార్థాలుపుల్ల మామిడి తరుగు -ఒక కప్పుకంది పప్పు - ఒక కప్పుపచ్చిమిర్చి - మూడు కరివేపాకులు - గుప్పెడుపసుపు - అర టీస్పూనుకొత్తిమీర తరుగు - రెండు స్పూనులుజీలకర్ర - ఒక స్పూనుఆవాలు - అర స్పూనుమినప్పప్పు - ఒక స్పూనురసం మసాలా - ఒక టీస్పూనుఉప్పు - రుచికి తగినంతనూనె - ఒక టీస్పూను

తయారీ ఇలా1. పప్పు బాగా కడిగి కుక్కర్లో వేయాలి. మామిడి ముక్కలు, రెండు కప్పుల నీళ్లో పోయాలి. 2. కుక్కర్‌ను అయిదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 3. తరువాత కుక్కర్ ఓపెన్ చేసి మెత్తగా మెదపాలి. 4. తిరిగి కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టాలి. మూత పెట్టకుండా ఉడికించాలి. రెండు గ్లాసుల నీళ్లు పోయాలి.5. ఆ పప్పులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. 6. చారు మసాలా కూడా వేసి బాగా కలపాలి. 7.దించే ముందు కొత్తిమీర చల్లి దింపేయాలి.పుల్లపుల్లగా ఉండే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది.  

Also read: ఆరోగ్యం కోసం అన్నం తగ్గించండి, కూరలు ఎక్కువ తినండి

Also  read: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే

Also read: డయాబెటిస్ రీడింగులు ఎంత మోతాదు దాటితే మందులు వేసుకోవడం ప్రారంభించాలి?