ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం సంప్రదాయంగా మారిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు ఛేదనకు అనుకూలంగా ఉంటుండటంతో కెప్టెన్లు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు.


మయాంక్ అగర్వాల్‌కు గాయం కావడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో ఇదొక్కటే మార్పు. ఇక సన్‌‌రైజర్స్ తన తుదిజట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. గత మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతోనే బరిలోకి దిగింది.


పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, లియాం లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మలిక్, టి నటరాజన్