దక్షిణాది ఆహారంలో అన్నానికే చాలా ప్రాధాన్యం. అధిక మొత్తంలో వరి అన్నాని తిని, కూరలు తక్కువగా తింటారు. నిజానికి అన్నం కన్నా కూరల్లోనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అన్నంతో సమానంగా కూరలు తినమని చెప్పలేము కానీ, రెండు కప్పుల అన్నం తింటే ఒక కప్పు కూర తినాలి. అప్పుడే శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా, బరువు పెరగకుండా ఉంటుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. కానీ కూరల్లో ఎన్న రకాల అత్యవసర పోషకాలు లభిస్తాయి. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేందేంటంటే...
మేమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కూరలకు పెద్ద పీట వేయమని చెబుతోంది. రోజుకు మనం తినే ఆహారంలో 400 గ్రాములు కూరగాయలు ఉండాలి. అలాగే వేరేగా పండ్లు కూడా తినాలి. ఈ 400 గ్రాముల కూరల్లోనే ఆకుకూరలు, కూరగాయలు, దుంప కూరలు వచ్చేలా చూసుకోవాలి. అంటే రోజుకు మీరు దాదాపు అరకిలో వరకు కూరలే తినాలి. మిగతాది అన్నం, పాలు, పెరుగు, పండ్లతో భర్తీ చేయాలి. 


పళ్లెం ఎలా ఉండాలంటే...
భోజనం చేసేటప్పుడు పళ్లెం నిండుగా ఉండాలి.అన్నం, కూర, పప్పు, పెరుగు కచ్చితంగా భోజనంలో ఉండేట్టు చూసుకోవాలి.పాలు ఉత్పత్తులు వెన్న తీసినవి ఉపయోగించడం చాలా ఉత్తమం. బరువు పెరగకుండా ఉంటారు. 


విలువ లేదు
అన్నానికి, చపాతీలకు, బిర్యానీలకు ఇచ్చినంత విలువు కూరలకు ఎందుకు ఇవ్వరు? కూరలే శరీరంలోని పోషక లోపాన్ని తీర్చేది.క్యారెట్లు, బీట్ రూట్ లు, కీరాదోస వంటివి పచ్చివి తింటే చాలా మంచిది. వీటిని వండుకుని తినాలనే లేదు. వేపుళ్లు మానేసి, నీళ్లు పోసి కూరలా వండుకుంటేనే ఆ వంటకంలో పోషకాలు నిలుస్తాయి. సీజనల్ పండ్లు, కూరలను మిస్ అవ్వద్దు. కచ్చితంగా ఆయా సీజన్లలో కనీసం అయిదారు సార్లు తినాలి.   కుక్కర్లో పప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లను బయటపోయద్దు. అందులోనే వాటి సారమంతా ఉంటుంది. కూరగాయల్లో ఉండే ఫోలిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు, ఖనిజాల, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్  వల్లే మన శరీరం రోజువారీ పనులు చేయగలుగుతోంది. రోగాలతో పోరాడగలుగుతోంది. కాబట్టి కూరలకు అధిక ప్రాధాన్యమిచ్చి అధికంగా తినాల్సిందే.  అయితే చికెన్, మటన్ వంటివి మాత్రం మితంగా తినడమే మంచిదే. రోజులో అరకిలో చికెన్ తింటే మాత్రం కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి వెజిటేరియన్ కూరలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 


Also read: బిడ్డ పుట్టాక తల్లికి జుట్టు ఎందుకు ఊడుతుందో తెలుసా? ఆ రెండే కారణం


Also  read: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే