AP Summer Holidays : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నెల 28 నుంచి సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మే నెల 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నందున వారం రోజుల ముందు నుంచే కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 20న జూనియర్ కళాశాలలు తిరిగి తెరుస్తారు. జూ.కాలేజీల లెక్చరర్లకు మే 25 నుంచి సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
వేసవి సెలవులు ప్రకటన
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం, నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. టెన్త్, ఇంటర్ పూర్తవగానే వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. జూనియర్ కాలేజీలకు సంబంధించి మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నారు. అయితే ఆ పరీక్షలు పూర్తి కాగానే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు. జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
టెన్త్ , ఇంటర్ పరీక్షల తేదీలు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల(10th Class Exams) షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్(Intermediate) పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నారు. అందువల్ల పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, జేఈఈ(JEE) పరీక్షలు కారణంగా పరీక్షల షెడ్యూల్ ను మార్పులు చేశారు. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.
పదో పరీక్షల తేదీలు
- ఏప్రిల్ 27వ తేదీ - తెలుగు
- ఏప్రిల్ 28వ తేదీ - సెకండ్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 29వ తేదీ - ఇంగ్లిష్
- మే 2వ తేదీ - గణితం
- మే 4వ తేదీ - సైన్స్ పేపర్-1
- మే 5వ తేదీ - సైన్స్ పేపర్-2
- మే 6వ తేదీ - సోషల్
ఇంటర్ పరీక్షలు