Theft In Nellore Court: నెల్లూరులో కోర్టులో దొంగతనం జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ రచ్చ కూడా జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరిద్దరూ నెల్లూరు నగరానికి చెందినవారిగా గుర్తించారు. నెల్లూరు కుద్దూస్ నగర్ కి చెందిన సయ్యద్ హయత్, నెల్లూరు నగరం పొర్లుకట్టకి చెందిన రసూల్ లని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కోర్టులో దొంగతనానికి కారణం ఇదే..?
వారిద్దరూ పాత నేరస్తులు. అయితే వారు ఐరన్ స్క్రాప్ దొంగతనం కోసం అక్కడికి వెళ్లారు. కోర్టు వెనక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ ఐరన్ స్క్రాప్ ఉంది. స్క్రాప్ దొంగతనం కోసం వెళ్లే సరికి అక్కడ కుక్కలు అరిచాయి. దీంతో వారు భయపడి పక్కనే ఉన్న కోర్టు దగ్గరకు పరిగెత్తారు. కోర్టులోకి ప్రవేశించి తలుపులు పగలగొట్టారు. లోపల బ్యాగ్ దొంగిలించారు. అందులో సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ చోరీ చేశారు. మిగతా వస్తువులను అక్కడే పడేసి వెళ్లారు. దీనివెనక ఉన్న స్టోరీ ఇది అని పోలీసులు బయటపెట్టారు.
ఆ దొంగలిద్దరూ 14 పాత కేసుల్లో ఏ1 ముద్దాయిలుగా ఉన్నారని చెప్పారు పోలీసులు. ఒక లాప్ టాబ్, ఒక టాబ్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులను రికవరీ చేశామని తెలిపారు. పక్కా ఆధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు. ఎలక్ట్రానికి వస్తువులు చోరీ చేసిన దొంగలు, బ్యాగ్ అక్కడే పడేసి వెళ్లారని చెప్పారు. అయితే దీనిపై వచ్చిన రాజకీయ విమర్శలపై తాము స్పందించబోమని అన్నారు ఎస్పీ.
Also Read: Theft In Nellore Court: కోర్టులో రూంలోనే దొంగతనం - ఏం ఎత్తుకుపోయారో తెలిస్తే అవాక్కవుతారు!
కోర్టులోనే దొంగతనం ఎందుకు..?
బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. గురువారం ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించారు. ఆ సంచిలో ఉండాల్సిన పలు కీలక డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దొంగల జాడ గురించిన సమాచారం కష్టతరంగా మారింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కీలకమైన ఆధారాల కోసమే దొంగతనం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కీలక ఆధారాలు ఏ కేసుకి సంబంధించినవి అనే విషయంలో పోలీసులు ఇంకా అధికారికంగా స్టేట్ మెంట్ ఇవ్వలేదు.
Also Read: Nellore Court Theft Politics : కొలంబియా తర్వాత నెల్లూరులోనే ! కోర్టు చోరీ ఘటనపై రాజకీయ కలకలం