Mahatma Gandhi Lifestyle : మహాత్మ గాంధీ జీవితమే పోరాటాలమయం. సాధారణ కుటుంబంలో జన్మించినా... ఆయన జీవితం మొత్తం పోరాటాలు, ఉద్యమాలు, సంస్కరణల బాటలోనే సాగింది. స్వదేశానికి స్వేచ్ఛను తీసుకువచ్చేందుకు ఆయన చేసిన శాంతియుత పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన శాంతీయుతంగా చేసిన ఉద్యమాల ముందు బ్రిటన్ ఓడిపోయింది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది. అందుకే ఆయన మనకే కాదు.. ప్రపంచంలోని ఇతర దేశాల వారికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చారు. 


ఈ స్ఫూర్తిధాతను జనవరి 30వ తేదీ 1948న హత్య చేశారు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు కుప్పకూలిపోయాడు. ఆయన చనిపోతే ఏమిటి.. ఆయన ఆశయాలు ఎందరినో శాంతియుతంగా ముందుకు నడిపాయి. ఇప్పటికీ ఆయన ఆశయాలు పాటించేవారు ఎందరో ఉన్నారు. కేవలం ఆయన ఆశయాలే కాదు ఆరోగ్య సూత్రాలు కూడా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడంలో మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. 


గాంధీజి డైట్​


దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. రక్తం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. ఆ మహనీయుడి వర్థంతి (Mahatma Gandhi Death Anniversary )ఇవాళ(జనవరి 30). పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఆయన పాటించిన ఆహారపు నియమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. అసలు గాంధీజి ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు? ఎలాంటి ఫుడ్​కి దూరంగా ఉండేవారో ఇప్పుడు చుద్దాం.


మహాత్మ గాంధీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన ఫుడ్ మొత్తం శాఖాహారమే. తన డైట్​ మర్చుకోవాలని మిత్రులు, ఆప్తులు సలహా ఇచ్చినా దానిని ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. కేవలం శాఖాహారం వైపే మొగ్గు చూపేవారు. భారతదేశం నుంచి లండన్​లో చదువుకోవడానికి వెళ్లినా.. అక్కడ కూడా తన ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించేవారు. మిత్రులు మాంసం తీసుకోమని సలహా ఇచ్చినా.. వాటిని సున్నితంగా తిరస్కరించి.. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులతో కూడిన ఆహారం తీసుకునేవారు.


మూడు బుట్టల ప్రణాళిక


గాంధీజి తన ఆహారపు అలవాట్ల గురించి ‘ది సైన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అనే పుస్తకంలో వివరించారు. గాంధీ ఆహారం విషయంలో మూడు బుట్టల ప్రణాళికలు ఉండేది. మొదటి బుట్టలో శాకాహారం, రెండో బుట్టలో మాంసాహారం, మూడో బుట్టలో మిశ్రమ ఆహారం ఉండేది. మొదటి బుట్టలో  శాఖాహారానికి సంబంధించిన  పప్పులు,  తృణధాన్యాలు సహా పండ్లు, కూరగాయలు ఉండేవి. రెండో బుట్టలో  ఎక్కువగా మాంసం, పౌల్ట్రీ, చేపలు ఉంటాయి. గాంధీజీకి ఇష్టమైనది మిక్స్‌డ్-డైట్ బాస్కెట్ లేదంటే మూడో బాస్కెట్. ఇందులో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండేవి. పప్పు, కూరగాయలు, పాల ఉత్పత్తులు  ప్రధానంగా ఉండేవి. ఆయన ఎక్కువగా శాకాహారాన్నే తీసుకునే వారు.   స్టాన్లీ వోల్పెర్ట్ రచించిన ‘గాంధీస్ వే’ అనే పుస్తకం ప్రకారం గాంధీ చాలా పప్పులను ఎక్కువగా తీసుకునేవారు.   


గాంధీకి ఇష్టమైన ఫుడ్


బాపూజీ రోజూ ఒక పూట మాత్రమే భోజనం తినేవారు.  బ్రెడ్, పాస్తా, చక్కెర వంటి ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లేవారు కాదు.  అన్నం, పప్పు, చపాతీ, పెరుగు, పెడా ఆయనకు ఇష్టమైన వంటకాలు.  మానవ శరీరం తనను తాను పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని గాంధీ చెప్పేవారు. మనం సరైన ఆహారం తీసుకుంటేనే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందని గట్టిగా నమ్మేవారు.  శరీరం, మనస్సు విడదీయరానివని గాంధీ బలంగా భావించేవారు.  గాంధీ డైట్ ప్లాన్ మానసిక శక్తిని అందించడానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కొవ్వును కరిగించడంతో పాటు బలమైన కండరాలను పొందడలో ఎక్కువగా సాయపడేది. ఆయన డైట్​ను అప్పట్లో చాలా మంది పాటించేవారు. ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేందు మీరు కూడా ఈ డైట్​ ఫోలో అవ్వొచ్చు. 


Also Read : టేస్టీ రవ్వ ఇడ్లీలు.. వీటి తయారీకి మినపప్పు అవసరమే లేదు