Indian Railway News : దేశంలో రవాణా సౌకర్యాలు ఎంత మెరుగుపడుతున్నా రైల్వేలకు ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే నిత్యం కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే శాఖ కొత్త విధానాలతో మెరుగైనా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రూల్స్‌ను కఠిన తరం చేస్తోంది. గతంలో ఉన్న లోపాలను సవరిస్తూ వస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన రూల్‌ అమల్లో తీసుకురానుంది. 


రైల్వే రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎక్కాల్సిన స్టేషన్‌లో ఎక్కకుండా ముందుస్టేషన్‌లలో ఎక్కుతుంటారు. ఇలాంటి వారిలో చాలా కారణాలతో ఇలా చేస్తుంటారు. అందులో వ్యక్తిగత కారణం ఒకటైతే... ముందు స్టేషన్‌ నుంచి రిజర్వేషన్ త్వరగా అవుతుందని ఇలా చేసే వాళ్లు కూడా ఉంటారు. చాలా ఏజెన్సీలు కూడా ఈ టెక్నిక్‌ను వాడుతూ రిజర్వేషన్లు చేస్తుంటారు ప్రయాణికుల నుంచి డబ్బులు గుంజుతుంటారు. 


ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ ఈ రూల్‌ను కఠిన తరం చేస్తోంది. ఇకపై ఒక స్టేషన్‌లో ఎక్కుతామని రిజర్వేషన్ చేయించుకొని ముందు స్టేషన్‌లో ఎక్కేందుకు అనుమతించడం లేదు. అంటే సికింద్రాబాద్ స్టేషన్‌లో రిజర్వేషన్ చేయించుకుంటే అక్కడే ఎక్కాలి. తర్వాత స్టేషన్‌లో ఎక్కుతాను అంటే కుదరదు. 


ఒక వేళ ఎక్కినా నీ రిజర్వేషన్‌ వేరే వాళ్లకు కేటాయించే అధికారం టీటీఈకి ఇచ్చారు. నీవు ఎక్కేసరికి రిజర్వేషన్ లేకపోతే అడిగే హక్కు ప్రయాణికులు కోల్పోతారు. ఎక్కడ ఎక్కుతామని రిజర్వేషన్ చేయించుకుంటే ఆ స్టేషన్‌లోనే ట్రైన్ ఎక్కాలి. లేకుంటే ఆ బెర్త్‌ను వేరే వాళ్లకు కేటాయించేస్తారు. 


దీనికి సంబందించిన ఆన్‌లైన్ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. దీని ఆధారంగా మీ సీటును ఖాళీ ఉన్నట్టు పరిగణిస్తారు. దాన్ని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి ఆటోమేటిక్‌గా కేటాయించేస్తారు. మొన్నటి వరకు ప్రయాణికుల లిస్ట్‌ను ప్రింట్ ఫార్మాట్‌లో ఇచ్చే వాళ్లు ఈ మధ్య కాలంలో వారికి ట్యాబ్‌లు ఇస్తున్నారు. అందుకే ప్రయాణికుల జాబితా ఎప్పటికప్పుడు అప్‌డేటూ డేట్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుడు ఎక్కపోతే రెండు స్టేషన్ల వరకు వెయిట్ చేసే వాళ్లు ఇకపై ఇలాంటి పప్పులు ఉడకవని చెబుతోంది రైల్వే శాఖ. మీరు రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్‌లో ట్రైన్ ఎక్కకపోతే మీరు సీటును కోల్పోయినట్టే అంటోంది.