Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఎంతోమంది అధిక బరువు బారిన పడుతున్నారు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బొడ్డు చుట్టూ కొవ్వు ఉండడం వల్ల అంతర్గత అవయవాలకు హాని జరుగుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బొట్టు చుట్టూ కొవ్వు నిల్వలు అధికంగా ఉంటే దాన్ని విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇది కొంచెం మొత్తంలో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని అధికంగానే దెబ్బతీస్తుంది. పొట్ట చుట్టూ చేరిన కొవ్వును త్వరగా తగ్గించుకోవాలంటే కొన్ని రకాల పనులు చేయాలి. అది కూడా ఉదయం పూటనే చేస్తే తగ్గుతుంది.


ఉదయం లేచిన వెంటనే నిమ్మరసం కలిపిన గ్లాసు నీటిని తాగాలి. ఇది జీవక్రియను ప్రారంభించేందుకు అద్భుతమైన మార్గం. ఈ రిష్రెష్‌మెంట్ సమ్మేళనం... రాత్రంతా ఉపవాసం ఉన్నాక మీ శరీరాన్ని తేమవంతం చేయడానికి సహకరిస్తుంది. అలాగే శరీరాన్ని డిటాక్సిపికేషన్ చేస్తుంది. ఇది కొవ్వును కాల్చే ప్రక్రియను పెంచుతుంది. దీనివల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది.


ఉదయం వ్యాయామం చేయడం వల్ల కూడా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు. వేగంగా నడవడం, యోగా చేయడం వంటి కొన్ని తేలికపాటి వర్కౌట్స్ చేయడం ద్వారా శరీరాన్ని పగటిపూట ఎక్కువగా కదిలించాలి. ఇది జీవక్రియను మెరుగుపరిచి కొవ్వును కరిగిస్తుంది. ప్రతి ఉదయం కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయడం చాలా అవసరం.


ఉదయం అల్పాహారంలో కచ్చితంగా ప్రోటీన్ నిండిన ఆహారం ఉండేలా చూసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేయడానికి ప్రోటీన్ అవసరం. పోషకాలు అధికంగా ఉండే భోజనంతో మీ రోజును ప్రారంభించడం చాలా ముఖ్యం. గుడ్లు, పెరుగు, ప్రోటీన్స్ నిండిన స్మూతీ వంటి ఆహారాలను మీ అల్పాహారంలో చేర్చుకోవాలి. ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. దీనివల్ల కేలరీలు బర్న్ అవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగే అవకాశం ఉంది.


ఈ ఆహారాన్ని అయినా ఇష్టపూర్వకంగా తినాలి. అలాగే మితంగా తినాలి. అతిగా తినడం వల్ల కూడా పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంది. టీవీ చూస్తూ తింటే ఉదయం పూట భోజనం కూడా అధికంగా తినే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఆహారం పైనే శ్రద్ధ పెట్టి తినడం అవసరం.


ఉదయం భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇది ప్రత్యేకంగా పొట్ట కొవ్వును లక్ష్యంగా చేసుకుంటుంది. కాబట్టి మీ అల్పాహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ నిండిన పదార్థాలను తినడం చాలా ముఖ్యం. ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కూడా కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది.


దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు భాగంలోనే ఈ ఒత్తిడి వల్ల కొవ్వు చేరుతుంది. కాబట్టి మీ ఉదయపు దినచర్యలో కచ్చితంగా ధ్యానం ఉండేలా చూసుకోండి. చిన్న మెడిటేషన్ సెషన్ నిర్వహించుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


తగినంత నిద్ర కూడా పొట్ట కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్మోన్ల నియంత్రణకు అంతరాయం కలుగుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. దీనివల్ల అధికంగా ఆహారం తిని కొవ్వు నిల్వలను పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. అయితే ఆ నిద్ర రోజు ఒకే సమయంలో ఉండాలి.


Also read: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ వచ్చింది, మనదేశంలో వచ్చేది ఎప్పుడు?


















































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.