Malaria Vaccine: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ వచ్చింది, మనదేశంలో వచ్చేది ఎప్పుడు?

మలేరియా వల్ల మరణిస్తున్న పిల్లల సంఖ్య అధికంగానే ఉంది.

Continues below advertisement

Malaria Vaccine: మలేరియా జ్వరం చెప్పుకోవడానికి చిన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ మన దేశంలో ఏటా మలేరియా జ్వరం బారిన పడి ఇరవై వేల మంది మరణిస్తున్నారు. మలేరియా జ్వరం బారిన పడి మెదడులోని రక్తనాళాలు వాపు రావడం, రక్తహీనత బారిన పడడం, అవయవాలు వైఫల్యం చెందడం వంటి కారణాల వల్ల ఎంతో మంది రోగులు చాలా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ ఇంతవరకు మలేరియాకు వ్యాక్సిన్ రాలేదు. ఆఫ్రికా దేశాల్లో కూడా మలేరియా మరణాలు చాలా అధికంగా ఉన్నాయి. ఏటా ఐదు లక్షల మంది పిల్లలు కేవలం మలేరియా కారణంగానే ఆఫ్రికాలో మరణిస్తున్నారు. అందుకే మలేరియా వల్ల కలిగే మరణాలను తగ్గించేందుకు మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్. ఇంతవరకు మలేరియా కోసం ఎవరూ వ్యాక్సిన్ తయారు చేయలేదు.

Continues below advertisement

R21 అని పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికన్ దేశాలు ఆమోదించాయి. ఈ ఖండంలోని 12 దేశాలలో 18 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను అందించమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికాలోని 12 దేశాలకు రాబోయే రెండేళ్ల కాలంలో 18 మిలియన్ డోసులను అందిస్తుంది. ఆ ఖండంలో మరణాలను ఆపడమే ఈ వ్యాక్సిన్ మొదటి కర్తవ్యం. మనదేశంలో కూడా మలేరియా కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. 2021లో దక్షిణాసియాలో సంభవించిన మలేరియా రోగులలో 79% మన దేశంలో ఉన్నారు. అలాగే మలేరియా వల్ల చనిపోయిన వారిలో 82% మంది మన దేశానికి చెందినవారే. దీన్ని బట్టి మన దేశంలో మలేరియా ఎంతగా విస్తరిస్తుందో అర్ధమవుతుంది.

అయితే మనకు ఇంతవరకు మలేరియా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆఫ్రికా వారు అనుమతించిన R21 వ్యాక్సిన్ ఇంకా మన దేశంలో ఆమోదించలేదు. మలేరియా వ్యాక్సిన్ ముఖ్యమైన శాస్త్రీయమైన అభివృద్ధి అయితే మన దేశంలో ఆమోదించడానికి కొన్ని పర్యవసానాలు పరిశీలించాల్సి వస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆఫ్రికాలో విడుదల చేసిన వ్యాక్సిన్ అక్కడి ఉష్ణోగ్రతకు, ప్రాంతానికి తగ్గట్టు పనిచేస్తుందని, అది మన దేశంలో ఎలా పనిచేస్తుందో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం 2030 నాటికి మన దేశం నుంచి మలేరియాను నిర్మూలించాలని ఆలోచిస్తుంది. త్వరలోనే మనదేశంలో కూడా మలేరియా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఎంతోమంది పిల్లల ప్రాణాలను మనం కాపాడుకున్నవారము అవుతాము.

Also read: ఈ పండ్ల పేరు ఏమిటో తెలుసా? ప్రధానమంత్రి మోడీకి ఎంతో ఇష్టమైనవి

Also read: సాగర కన్యతో కలిసి ఈదాలంటే ఆ బీచ్‌కు వెళ్లాల్సిందే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement