Mermaid Job:  సాగర కన్యను సినిమాల్లోనే చూసాము, ఎన్నో కథల్లో విన్నాము. కానీ నిజమైన సాగర కన్యను ఎవరూ చూడలేదు. అసలు అలాంటి జీవి ఉంటేనే కదా చూడడానికి. కానీ ప్రపంచంలోని జనాలకు సాగర కన్య, జలకన్య, మత్య్స కన్యలు అంటే ఎంతో ఆసక్తి. ఆ సినిమాలనే కాదు కథలను కూడా చాలా ఇష్టంగా వింటారు. అందుకే అలాంటి ఉద్యోగం ఒకటి పుట్టుకొచ్చింది. బ్రిటన్‌కు చెందిన మహిళ మాస్ గ్రీన్. ఈమె బతుకుదెరువు కోసం 2016లో ఇటలీకి వెళ్ళింది. అక్కడ ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తూ జీవిస్తోంది. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైంది. ఆమెకు ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టేసింది. ఓసారి బీచ్‌కు వెళితే... ఆ బీచ్‌లో ఒక వ్యక్తి సాగర కన్యలా డ్రెస్ వేసుకొని కనిపించాడు. అది చూసి ఆమెకు కూడా అలా తయారవ్వాలి అనిపించింది.


సాగర కన్యగా డ్రెస్సులు కుట్టించుకొని తయారై, ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసేది. ఆమె ఫోటోలకు లైక్‌లు, షేర్లు బాగా వచ్చేవి. దీంతో ఇటలీ అంతా ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన ఒక ఐలాండ్ వారు ఆమెకు సాగర కన్యగా ఉద్యోగం ఇస్తామని పిలిచారు. సరదాగా తీసుకున్న ఫోటోలు ఇలా ఉద్యోగం తెచ్చిపెడతాయని ఆమె అనుకోలేదు. సిసిలీ నగరానికి దగ్గర్లో ఉన్న ఒక ఐలాండ్లో ఇప్పుడు ఆమె సాగర కన్యగా ఉద్యోగం చేస్తోంది. ఆమె చేయాల్సిందల్లా ఒక్కటే. ఆ దీవికి ఎంతో మంది పర్యాటకులు వస్తారు. బీచ్‌లో వారంతా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఈమె సాగరకన్యలా తయారై వారి మధ్యలో జలకన్యలా ఇటు అటు తిరగడమే. పర్యాటకులు ఆమెను చూసేందుకు వస్తూ ఉంటారు. 


అలాగే జలచరాలు నీటిలో ఎలా కదులుతాయో కూడా పర్యాటకులకు వివరించాలి. ఈదడం నేర్పించాలి. ఇవన్నీ ఆమె చేయాల్సిన ఉద్యోగంలోని విధులు. రోజులో సుమారు 12 గంటలు ఈ పని చేయాల్సి వస్తుంది. ఈ ఉద్యోగం కోసం ఆమె ఎన్నో మెళకువలు నేర్చుకుంది. నీళ్లలో ఎక్కువ సేపు ఈదడం,  ఊపిరిబిగపట్టి ఉండడం వంటివి అభ్యాసం చేసింది. ఇప్పుడు తన ఉద్యోగంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెబుతోంది మాస్ గ్రీన్. టీచర్ కాస్త సాగర కన్యగా మారిపోయింది. ఈ సాగర కన్యను చూసేందుకే ఇప్పుడు ఎంతోమంది వస్తున్నారు. టీచర్‌గా పని చేసేటప్పుడు వచ్చే జీతంతో పోలిస్తే, సాగర కన్యగా ఆమెకొస్తున్న జీతం తక్కువేనట. అయితే ఈ ఉద్యోగం ఆమెకు చాలా నచ్చిందని, అందుకే జీతం తక్కువ అయినా ఆ ఉద్యోగం చేస్తున్నారని చెబుతోంది మాస్ గ్రీన్. అయితే తాను సంతోషంగా బతకడానికి సరిపడా వస్తోందని, ఇష్టమైన పని కూడా చేస్తున్నానని చెప్పుకొస్తోంది. 



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


Also read: పచ్చిమిరపకాయలు కొనలేకపోతున్నారా? అయితే వంటల్లో వీటిని వాడండి