Stock Market Today, 11 July 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 33 పాయింట్లు లేదా 0.17 శాతం గ్రీన్ కలర్‌లో 19,490 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
వేదాంత: వేదాంతతో కలిసి ఏర్పాటు చేసిన 19.5 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ జాయింట్ వెంచర్ (JV) నుంచి తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) కంపెనీ వైదొలిగిన తర్వాత, వేదాంత రియాక్ట్ అయింది. "సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, భారతదేశపు మొదటి సెమీకండక్టర్ ఫెసిలిటీని స్థాపిస్తామని, జేవీ కోసం ఇతర పార్ట్‌నర్స్‌తో ఆల్రెడీ చర్చలు జరుపుతున్నామని" అగర్వాల్ గ్రూప్ ప్రకటించింది.
వాడిలాల్ ఇండస్ట్రీస్: వాడిలాల్ ఇండస్ట్రీస్‌లో కొంత వాటా కొనుగోలు చేయాలని బెయిన్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వాడిలాల్ ఇండస్ట్రీస్ (Vadilal Industries) వివరణ ఇచ్చింది. తమకు అలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
SBI కార్డ్స్: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & CEO అయిన రామమోహన్ రావు అమర, తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రిజిగ్నేషన్ ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. MD & CEO పదవితో పాటు డైరెక్టర్ల బోర్డ్ నుంచి కూడా రామమోహన్ రావు తప్పుకుంటారు.
తేగ ఇండస్ట్రీస్: ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (Tega Industries CFO) శరద్ కుమార్ ఖైతాన్‌ను డైరెక్టర్ల బోర్డు నియమించింది.
మదర్సన్ సుమి వైరింగ్: మదర్సన్ సుమీ వైరింగ్ డైరెక్టర్ల బోర్డ్ మహేందర్ ఛబ్రాను కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) నియమించింది.
శాటిన్ క్రెడిట్‌కేర్: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDs) జారీ చేసి 5,000 కోట్ల రూపాయల వరకు నిధుల సమీకరించాలన్న శాటిన్ క్రెడిట్‌కేర్ (Satin Creditcare) ప్రతిపాదనను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
JSW స్టీల్, డాక్టర్ రెడ్డీస్: ఈ రెండు కంపెనీల స్టాక్స్ ఇవాళ ఎక్స్-డివిడెండ్‌గా మారతాయి. ఆయా కంపెనీలు ప్రకటించిన డివిడెండ్ మొత్తం ఇవాళ షేర్ ప్రైస్ నుంచి తగ్గిపోతుంది. కాబట్టి, JSW స్టీల్, డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's) షేర్లు ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
టాటా కమ్యూనికేషన్స్: టాటా గ్రూప్ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్‌కు (Tata Communications) చెందిన అనుబంధ సంస్థ, 'ఆర్మ్ ఒయాసిస్ స్మార్ట్ సిమ్ యూరోప్ SAS'లో మిగిలిన ఈక్విటీ స్టేక్‌ను కూడా దక్కించుకునేందుకు ముందడుగు వేసింది. మిగిలిన షేర్లన్నీ కొనేందుకు, 'షేర్ పర్చేజ్ అగ్రిమెంట్' కుదుర్చుకుంది.
ఇది కూడా చదవండి: మార్కెట్లోకి అత్యంత చవకైన హ్యుండాయ్ కారు ఎంట్రీ - రూ.ఆరు లక్షల లోపే - పంచ్‌కు పోటీ!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial