హ్యుండాయ్ బడ్జెట్ ఎస్‌యూవీ కారు ఎక్స్‌టర్ మనదేశంలో లాంచ్ అయింది. యంగ్ యూజర్లు లక్ష్యంగా ఈ కారును హ్యుండాయ్ లాంచ్ చేసింది. హ్యుండాయ్ దగ్గరున్న కలెక్షన్‌లో ప్రస్తుతానికి అత్యంత చవకైన కారు ఇదే. ఈ మోడల్ మొదటగా మనదేశంలోనే లాంచ్ అయింది. టాటా పంచ్‌కు ఈ కారు గట్టిపోటీని ఇవ్వనుంది.


హ్యుండాయ్ ఎక్స్‌టర్ ధర
దీని ధర మనదేశంలో రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ మోడల్ ధర. ఇక టాప్ ఎండ్ మోడల్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూం ధరలు. అంటే ఆన్ రోడ్ ప్రైస్ మరింత ఎక్కువగా ఉండవచ్చు.


హ్యుండాయ్ ఎక్స్‌టర్ ఫీచర్లు
ఈ కారు EX, S, SX, SX(O), SX(O) Connect అనే ఐదు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (స్మార్ట్ ఆటో ఏఎంటీ), 1.2 లీటర్ బై ఫ్యూయల్ కప్పా పెట్రోల్ విత్ సీఎన్‌జీ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్లలో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది.


హ్యుండాయ్ ఎక్స్‌టర్‌లో రెండు డిస్‌ప్లేలు ఉన్నాయి. వీటిలో మొదటిది 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం. దీంతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ మిడ్ డిస్‌ప్లే కూడా ఉంది. దీనికి ఏకంగా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లు కూడా అందించారు. ఈ ధరల విభాగంలో మొదటిసారిగా స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లతో లాంచ్ అయిన ఎస్‌యూవీ ఇదే.


ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు పాయింట్ల సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, కీలెస్ ఎంట్రీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial