రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రెడ్‌మీ 12 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గత నెలలో కొన్ని దేశాల్లో లాంచ్ అయింది. మీడియాటెక్ జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. హోల్ పంచ్ డిస్‌ప్లే ఉన్న దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. రెడ్‌మీ 12లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.
షావోమి తెలుపుతున్న దాని ప్రకారం రెడ్‌మీ 12 మనదేశంలో ఆగస్టు 1వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా కంపెనీ తీసుకువచ్చింది. ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇందులో చూడవచ్చు.
రెడ్‌మీ 12 ఇప్పటికే యూరోప్‌లో లాంచ్ అయింది. మిడ్‌నైట్ బ్లాక్, పోలార్ సిల్వర్, స్కై బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 199 యూరోలుగా (సుమారు రూ.17,000) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. 5,299 థాయ్ బాత్‌లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో రూ.12,500 వరకు అన్నమాట. మనదేశంలో ఈ ఫోన్ దాదాపు ఇదే ధరతో లాంచ్ కానుంది.
రెడ్‌మీ 12 స్పెసిఫికేషన్లు (అంచనా)
దీని భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్లు యూరోప్ మోడల్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. 90 హెర్ట్జ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ద్వారా రెడ్‌మీ 12 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ర్యామ్‌ను ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉపయోగించి 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.
రెడ్‌మీ 12లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ముందు వైపు ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial