Elon Musk Rate Limit Tweet: ఎలాన్ మస్క్ ట్విట్టర్ వినియోగదారుల కోసం రీడ్ లిమిట్‌ని సెట్ చేసారు. ఆ లిమిట్‌ను దాటిన తర్వాత, మీరు Twitter కంటెంట్‌ను చూడలేరు. సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్లు అంటే బ్లూ టిక్‌లు ఉన్న వ్యక్తులు ఒక రోజులో 10,000 పోస్ట్‌లను చదవగలరని ఎలాన్ మస్క్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. అదే విధంగా అన్‌వెరిఫైడ్ యూజర్లు 1,000 పోస్ట్‌లను చూడగలరు. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లు ఒక రోజులో 500 పోస్ట్‌లను మాత్రమే చూడగలరు.


మొదట్లో ఎలాన్ మస్క్ రీడ్ లిమిట్‌కు సంబంధించి 38 పదాల ట్వీట్‌ను ట్వీట్ చేశాడు. అందులో అతను తాజా అప్‌డేట్‌లను ఒకదాని తర్వాత ఒకటి జోడించి చివరకు 10,000 పోస్ట్‌లకు పెంచినట్లు ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ చరిత్ర సృష్టించింది.


ఈ ట్వీట్ రికార్డు సృష్టించింది
వాస్తవానికి, మస్క్ చేసిన ఈ 38 పదాల ట్వీట్ కొత్త రికార్డును సృష్టించింది. దాని రీచ్/వ్యూస్ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈ ట్వీట్‌ను 467 మిలియన్లకు పైగా యూజర్లు చూశారు. అంటే దాదాపు 46.7 కోట్ల మందిని ఆ ట్వీట్ చేరిందన్న మాట.






సంతోషం వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్
మస్క్ కూడా తన ట్వీట్‌కి రికార్డు వ్యూస్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై యూజర్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ ట్వీట్ 1 బిలియన్ యూజర్ల ట్రాఫిక్‌ను దాటుతుందా అని ఒక యూజర్ సందేహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న వ్యక్తి ఎలాన్ మస్క్‌నే. తనను 146 మిలియన్ల యూజర్లు ఫాలో అవుతున్నారు. ఆయన 341 మందిని ఫాలో అవుతున్నారు.