చాలా మందికి ఫిట్జెటింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారిని చూసినపుడు మాత్రం విసుగ్గా అనిపిస్తుంది. ఇలాంటి అలవాటుంటే మాత్రం మానుకోవాలి ఎందుకంటే ఇది చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో ఉన్నపుడు ఇబ్బందిగా కూడా ఉంటుంది.
పిట్జెటింగ్ అంటే?
అంటే అదే పనిగా చిన్నగా చేతులు కాళ్లు కదిలించడం, లేదా చేతి మెటికలు విరవడం, అసహనం లేదా అసౌకర్యంగా ఉండడం, ఇదొక మానసిక చంచల స్థితిగా చెప్పవచ్చు.
ఇది యాంగ్జైటీని వ్యక్తం చేసే ఒక శారీరక స్థితి. చాలా మంది ఫిట్జెటర్లలో చేతి వేళ్లలో కదలికలు సాధారణ. ఫిట్జెటింగ్లో కాళ్లు ఊపడం, గోళ్లు కొరకడం, శరీరాన్ని అటూఇటూ కదిలించడం, అప్పటి వరకు జుట్టు వదిలేసి ఉన్న వారు యాంగ్జైటీ మొదలు కాగానే జుట్టు కట్టుకోవడం లేదా జుట్టు కట్టుకుని ఉంటే దాన్ని విప్పేయడం ఇలా రకరకాలుగా ఉంటుంది.
కొన్ని సంవత్సరాల క్రితమే పిట్జెట్ స్పిన్నర్ మార్కెట్లో విడుదలయింది. రకరకా సైజుల్లో దొరుకుతున్నాయి. చేతులు లేదా కాళ్లు అదేపనిగా అసంకల్పితంగా కదులుతాయి. యాంగ్జైటీ అనేది ఎప్పుడైనా అసౌకర్యమే కదా. కొద్దిపాటి యాంగ్జైటీని అవాయిడ్ చెయ్యొచ్చు లేదా మేనేజ్ చెయ్యొచ్చు కానీ దీర్ఘకాలం పాటు కొన సాగితే మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటుందనేది కాదనలేము.
మన శరీరం ఒక శక్తి నిల్వచేసే సాధనం. మనం పనుల్లో ఉన్నపుడు ఈ శక్తిని అది వినియోగిస్తుంది. ఆందోళనలో ఉన్నపుడు దాన్ని మేనేజ్ చేసేందుకు కూడా కొంత శక్తి వినియోగించాల్సి వస్తుంది. యాంగ్జైటీ మేనేజ్మెంట్ కోసం ఏమీ చెయ్యకపోతే ఏం జరుగుతుంది? దాన్ని అలాగే అణచి పెట్టి రోజువారీ పనుల్లో పడితే ఏమౌతుంది? ఇలా మేనేజ్ చెయ్యని ఆందోళన మీ రోజు వారి జీవితంలోకి ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తుంది. అది వేళ్ల కదలికల రూపంలో కావచ్చు, లేదా కాళ్ల కదలికల రూపంలో కావచ్చు, లేదా గోళ్లు కొరకడం రూపంలోనూ కావచ్చు. ఇది ఆందోళన నుంచి కాపాడుకునేందుకు శరీరం ఎంచుకున్న స్వీయ మేకానిజం అని చెప్పవచ్చు.
ఫిట్జింగ్ అనేది యాంగ్జైటీ మాత్రమే కాదు ADHD, ఆటిజం వంటి ఇతర మానసిక సమస్యల్లో కూడా సాధారణంగా కనిపిస్తుంది. పెట్జెటింగ్ అనేది కేవలం కోపింగ్ మెకానిజం మాత్రమే కాదు. ఆందోళన, ఒత్తిడికి గురైన ప్రతి సారీ నాడిసంబంధ శక్తి కొంత విడుదల అవుతుంది. ఆటిజం పిల్లలను గమనిస్తే వారు యాంగ్జైటీలో ఉన్నపుడు అదే పనిగా చేతితో దేన్నైనా తట్టడం లేదా పదే పదే ఒకే రకమైన కదలికలు చెయ్యడం గమనించవచ్చు. ఇదొక శక్తి వినియోగ ప్రక్రియ.
పెట్జెటింగ్ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే దాని నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవడం అవసరం. దీని కోసం కొంత మంది మైండ్ ఫుల్ నెస్, డీప్ బ్రీతింగ్ టెక్నిక్ ల ద్వారా మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆందోళన వల్ల విడుదలైన అదనపు శక్తి వినియోగించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని అంటున్నారు నిపుణులు.
బ్రిస్క్ వాకింగ్ తో మొదలు పెట్టి నెమ్మదిగా జాగింగ్, రన్నింగ్ కు మారవచ్చు. ఇలాంటి వర్కవుట్ ల ద్వారా కూడా యాంగ్జైటీ తగ్గుతుందట.
కొంత మంది ఫిట్జెటింగ్ ను అధిగమించేందుకు కొన్ని పరికరాలను కూడా వినియోగించేందుకు ఇష్ట పడుతున్నారు. అలాంటి వాటిలో మొబైల్ కవర్లు కూడా ఒకటి. ఇప్పుడు టెక్చర్డ్ సర్ఫేజ్ ఉన్న మొబైల్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని ఆకృతులను ఫిట్జెటింగ్ కు వాడవచ్చు.
Also read : ఇది విన్నారా? మందులో మంచింగ్‌తో డిప్రెషన్ దూరం - ఇవి తింటేనే బెనిఫిట్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial