బోటులో చిక్కుకున్న పర్యాటకులను కాపాండేందుకు వెళ్తున్న ఓ హెలికాప్టర్‌పై తిమింగలం దాడి చేసింది. నీటి నుంచి గాల్లోకి ఎగిరి మరీ హెలికాప్టర్‌ను నోటితో అందుకుంది. అమాంతంగా దాన్ని నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీంతో నెటిజనులు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. అది ఫేక్ వీడియో. 


‘వాట్సాప్’ మేథావులు ఫేక్ వీడియోలను సృష్టించి జనాలను పిచ్చోళ్లను చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇది కూడా అలాంటి వీడియోనే. ‘ఈ అరుదైన వీడియో కోసం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు ఒక మిలియన్ డాలర్లు చెల్లించారు’ అంటూ ఆ వీడియో కింద రాసి ఉంది. అది నిజమైన వీడియో అని భావించి కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ‘‘ఎంతో తెలివైన మీరే ఇలా మోసపోతే ఎలా?’’ అని ప్రశ్నిస్తున్నారు. 






వాస్తవానికి ఆ వీడియో 2017లో విడుదలైన ‘5 హెడెడ్ షార్క్ ఎటాక్’ సినిమాలోనిది. ఆ విషయం తెలియక కిరణ్ బేడీ ట్వీట్ చేయడాన్ని నెటిజనులు తప్పుబడుతున్నారు. ఆ తర్వాతి పోస్టులో ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ట్రోలింగ్స్ మొదలైపోయాయి. ఐపీఎస్ అధికారిగా ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన మీరు ఇలాంటి వీడియోలు ఆలోచించకుండా పోస్ట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు అంటున్నారు. మరి కొందరు మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇది నిజంగా మీరే పోస్ట్ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారనేది ఇక్కడ చూడండి. 


Also Read: వీడియో - అపస్మారక స్థితిలో పైలట్‌, అనుభవం లేకున్నా సేఫ్‌గా ల్యాండ్ చేసిన ప్రయాణికుడు














Also Read: ఛీ, యాక్, ఆ స్వామిజీ మలాన్ని తింటున్న జనం, ఆశ్రమంలో 11 శవాలు లభ్యం!