విమానం నడపాలంటే మాటలు కాదు. దానికి ఎంతో అనుభవం ఉండాలి. అందుకే, పైలట్లకు ఎంతో శిక్షణ ఇస్తారు. వారు అన్ని విధాలా కరెక్టుగా ఉన్నారని తేలిన తర్వాతే వారికి విమానం నడిపేందుకు లైసెన్స్ ఇస్తారు. అయితే, విమానాలు చాలా రకాలు ఉంటాయి. ప్యాసింజర్ విమానాలు, ప్రైవేట్ జెట్‌లు ఉంటాయి. ప్యాసింజర్లను తీసుకెళ్లే దేశీయ, విదేశీ విమానాల్లో ఇద్దరేసి పైలట్లు ఉంటారు. పైగా, అందులో ఉండే ఎయిర్ హోస్టెస్‌లు కూడా విమానం నడపడంలో శిక్షణ పొంది ఉంటారు. అయితే, ప్రైవేట్ జెట్ విమానాలను కేవలం ఒక్క పైలట్ మాత్రమే ఉంటాడు. దీంతో అతడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అతడి ఏమైనా జరిగితే.. విమానం కూలిపోతుంది. అయితే, అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి తనకు ఎలాంటి అనుభవం లేకుండానే విమానాన్ని నడిపి ఆశ్చర్యపరిచాడు. పైలెట్‌ అస్వస్థకు గురవ్వడంతో.. ప్రయాణికుడే స్వయంగా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. 


పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌ నుంచి కొంతమంది ప్రయాణికులతో సెస్నా కారవాన్ అనే విమానం బయల్దేరింది. ఎయిర్‌పోర్టకు సుమారు 112 కిలోమీటర్ల దూరంలో.. గాల్లో ఎగురుతున్న సమయంలో పైలట్ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడి వెనకాలే కూర్చొన్న ప్రయాణికులకు ఏం చేయాలతో అర్థం కాలేదు. విమానం కూలిపోతుందనే భయంతో ఓ ప్రయాణికుడు వెంటనే.. విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌ను సంప్రదించాడు. 


‘‘మేము ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాను. పైలట్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నాకు విమానం నడపడం రాదు’’ అని తెలిపాడు. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది. ‘‘ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?’’ అని కంట్రోల్ సిబ్బంది అడిగారు. ఇందుకు ఆ ప్రయాణికుడు సమాధానం చెబుతూ.. ‘‘ఏమో అర్థం కావడం లేదు. నాకు ఫ్లోరిడా సముద్ర తీరం కనిపిస్తోంది. కానీ, ఎక్కడ ఉన్నామో తెలియడం లేదు’’ అని తెలిపాడు. 


ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) టీమ్ స్పందిస్తూ.. ‘‘మీ విమానం రెక్కలు ఒక లెవెల్‌లో ఉండేలా చూసుకోండి. సముద్ర తీరాన్ని ఆనుకుంటూ ఉత్తరానికి గానీ, దక్షిణానికి గాని విమానాన్ని నడుపుతూ వెళ్లండి. మేం మీరు ఎక్కడ ఉన్నారు తెలుసుకుంటాం’’ అని తెలిపారు. నాలుగు నిమిషాల తర్వాత ఆ ప్రయాణికుడు.. మళ్లీ ATCని సంప్రదించాడు. ‘‘నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోగలిగారా? విమానంలో నావిగేషన్ స్క్రీన్ ఆన్‌‌లో లేదు. మీకు దీని గురించి ఏమైనా తెలుసా?’’ అని అడిగాడు. 


Also Read: ఈమెకు స్నానం ఓ గండం, ఏడ్చినా సరే డేంజర్, నీరు తాగితే మరణమే!


ఎట్టకేలకు ఏటీసీ సిబ్బంది ఆ విమానాన్ని గుర్తించారు. అది బోకా రాటన్‌లోని పామ్ బీచ్‌కు ఉత్తర దిశలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎలా ల్యాండ్ చేయాలో చెప్పారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారమే అతడు ఆ విమానాన్ని సురక్షితంగా, అనుభవం ఉన్న పైలట్‌లా సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అధికారులు ఆ ప్రయాణికుడి పేరుగానీ, ఆ పైలట్ ఆరోగ్య పరిస్థితి గురించి గానీ తెలపలేదు. అయితే, చరిత్రలో ఇదొక అరుదైన ఘటనగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 


Also Read: ఛీ, యాక్, ఆ స్వామిజీ మలాన్ని తింటున్న జనం, ఆశ్రమంలో 11 శవాలు లభ్యం!


ప్రయాణికుడు విమానాన్ని సేఫ్‌గా ల్యాాండ్ చేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి: