నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాలనే సంగతి తెలిసిందే. కానీ, ఆమెకు ఈ రూల్ వర్తించదు. ఆమె స్నానం చేస్తే.. ఆస్పత్రిపాలవుతుంది. చివరికి మనస్పూర్తిగా ఏడ్చే అవకాశం కూడా ఆమెకు లేదు. ఇక వర్షాకాలం, సీతాకాలం వచ్చిందంటే ఆమెకు చచ్చేంత భయం. అందుకే, ఆ సీజన్లో ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. అయితే, నీటి ఫోబియా ఉందని అనుకుంటే పొరపాటే. ఆమెకు ఉన్న సమస్య ‘వాటర్ అలర్జీ’. 


అరిజోనాలోని టక్సన్‌కు చెందిన అబిగైల్ బెక్ అనే 15 ఏళ్ల టీనేజర్ ‘ఆక్వాజెనిక్ ఉర్టికేరియా’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆమె పొరపాటున ఏడ్చినా, స్నానం చేసినా.. ఈమె శరీరంపై దద్దర్లు ఏర్పడతాయి. అందుకే ఆమె తల్లిదండ్రులు.. ఒక కంటి చుక్క కూడా రాలకుండా జాగ్రత్తపడతారు. ఈ సమస్యల వల్ల బెక్ కనీసం నీరు తాగడానికి కూడా వీలు లేదు. కేవలం ఎనర్జి డ్రింక్స్ లేదా దానిమ్మ జ్యూస్ తాగుతుంది. ఎందుకంటే.. ఆమె మనలా నీరు తాగితే మరణించే ప్రమాదం ఉంది. 


బెక్ తన సమస్య గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా కళ్ల నుంచి కొంచెం కన్నీరు కారినా చాలు. ముఖం ఎర్రబడి కాలిపోతున్నట్లు అనిపిస్తుంది. మనసుకు బాధ కలిగితే అందరిలాగానే ఏడుస్తాను. కానీ, ఆ ఏడుపు నన్ను శరీరకంగా మరింత బాధిస్తుంది. అందుకే, కన్నీళ్లు వస్తే.. అవి చర్మం మీదకు రాకుండా జాగ్రత్తపడతాను’’ అని తెలిపింది. 


‘‘నేను పొరపాటున నీళ్లు తాగితే.. ఛాతిలో మంట ఏర్పడుతుంది. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. నేను ఏదైనా తాగే ముందు.. అందులో నీటి శాతం ఎంత ఉందో తెలుసుకుంటాను. లెబుల్ తనిఖీ చేస్తాను. కానీ, ప్రపంచంలో ప్రతి పదార్థంలో నీరు ఉంటుంది’’ అని తెలిపింది. అయితే, ఈ వ్యాధి సాధారణంగా చాలామందిలో ఉంటుంది. కానీ, ఈమెకు మోతాదు ఎక్కువ. అందుకే, ఆమె రెండు రోజలకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తుంది. ఆ వెంటనే మందులు వేసుకుని బాధను కంట్రోల్ చేసుకుంటుంది. నోరు ఆరిపోకుండా, శరీరం నిర్జలీకరణకు గురికాకుండా ఉండేందుకు ఈమె చాలా తక్కువ మొత్తంలో నీటిని తాగుతుంది.  


ఈ సమస్య నుంచి బయటపడేందుకు బెకో రీహైడ్రేషన్, యాంటిహిస్టామైన్లు, స్టెరాయిడ్లను తీసుకుంటోంది. 12 ఏళ్ల వయస్సులోనే ఆమెకు ఈ సమస్య ఏర్పడింది. అయితే, ఇటీవలే సరైన రోగ నిర్ధరణ జరిగింది. ‘‘ఈ వ్యాధి నిర్ధరణకు ముందు ఓ సారి వర్షంలో తడిచాను. అది చాలా బాధించింది. అది యాసిడ్‌లా అనిపించింది. వర్షంలో తడిస్తే ఎలా ఉంటుందో అప్పటికి నాకు తెలీదు. దీంతో అమ్మను అడిగాను. వర్షం కురిస్తే మంటగా ఉండదని ఆమె చెప్పింది. ఈ సమస్య గురించి తెలిసిన వైద్యుడిని ఆశ్రయించడం చాలా కష్టతరమైంది’’ అని తెలిపింది. 


Also Read: ఛీ, యాక్, ఆ స్వామిజీ మలాన్ని తింటున్న జనం, ఆశ్రమంలో 11 శవాలు లభ్యం!


బెక్ తండ్రి మైఖేల్ బెక్ మాట్లాడుతూ.. ‘‘ఆమె నొప్పిని చూస్తే నాకు బాధ ఏస్తుంది. ఆమె నొప్పిని నేను భరించాలని అనుకుంటాను. ఆమె అలా బాధపడుతుంటే నిస్సహాయంగా చూస్తుంటాను. నేను ఆమె సమస్యను పరిష్కరించాలని అనకుంటాను. కానీ, నా వల్ల కాదు. నీటి వల్ల ఆమెకు ప్రమాదం ఉందని తెలుసు. కానీ, ఆమెను హైడ్రేట్ చేస్తూనే నీటి వల్ల సమస్య ఏర్పడకుండా కాపాడుకోవాలి’’ అని తెలిపారు. చూశారుగా, మీకు కూడా నీటితో ఇలాంటి అలర్జీలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.


Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!